Harbhajan Singh : ఆ క్రెడిట్ ధోనికి ఇస్తే.. మిగతా వాళ్ళు లస్సీ తాగడానికి వెళ్ళారా? : హర్భజన్

Harbhajan Singh : 2011 ప్రపంచకప్ లో టీంఇండియా విజయం సాధిస్తే క్రెడిట్ మాత్రం ధోనికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని మాజీ క్రికటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.. ప్రపంచ కప్ ధోని గెలిస్తే మిగతా వాళ్ళు లస్సీ తాగడానికి వెళ్ళారా? టోర్నీలో గొప్పగా ఆడిన గంభీర్ ఏం చేసినట్టు? క్రికెట్ అనేది ఓ గేమ్.. అందరూ రాణించినప్పుడే జట్టు విజయం సాధిస్తోందని భజ్జీ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ప్రస్తావన రాగా హర్బజన్ ఇలా స్పందించాడు. కాగా 2011 ముంబైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది భారత్.. 1983లో తొలిసారి కపీల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత్.. ధోని నాయకత్వంలో మరోసారి ఆ ట్రోఫీని అందుకుంది. ధోని ఫైనల్‌లో 91 పరుగులతో నాట్ అవుట్ గా నిలవగా, గంభీర్ 97 పరుగులతో జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com