HARDIK PANDYA: నో హేట్.. ఓన్లీ లవ్: శుభ్‌మన్ గిల్

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య వివాదాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌తో గిల్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. విమర్శల దాడి పెరగడంతో గిల్ స్పందించాడు. తమ మధ్యలో ఎలాంటి గొడవలు లేవని, కేవలం ప్రేమే ఉందని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో చూసింది ప్రతొక్కటి నమ్మొద్దని కోరాడు.
అసలేమైందంటే..?
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్టింట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం గుజరాత్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచులో గిల్ ప్రవర్తన నెటిజన్ల కోపానికి కారణమైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ వేసే క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా గిల్ పట్టించుకోలేదు. దీంతో టెస్ట్ కెప్టెన్‌గా మారిన తర్వాత గిల్‌కు అహంకారం పెరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
గిల్ కెప్టెన్సీపైనా విమర్శలు
ఐపీఎల్-2025 నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. సీజన్ ఆరంభం నుంచి వరుస విజయాలతో దుమ్మురేపిన జీటీ.. లీగ్ దశ చివర్లో పట్టాలు తప్పింది. వరుస మ్యాచుల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. దీంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయినా ఎలిమినేటర్‌లో ఆడక తప్పలేదు. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ ఫైట్‌లో జీటీ 20 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. ఆ జట్టు ఓటమికి ఆటగాళ్ల వైఫల్యంతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పిదం కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. ముఖ్యంగా బౌలింగ్ సమయంలో అతడు తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. అందుబాటులో ఉన్న బౌలర్లతో ఎప్పుడు బౌలింగ్ చేయించాలనే విషయంలో అతడు అనేక తప్పులు చేశాడు. ముఖ్యంగా సీజన్ మొత్తం అదరగొడుతూ వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ విషయంలో గిల్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫుల్ ఫామ్‌లో ఉన్న ప్రసిద్ధ్ ఈ ఐపీఎల్ మొత్తం మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ సక్సెస్ అయ్యాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అలాంటోడితో ముంబైతో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో బౌలింగ్ చేయించాడు గిల్. ఇది పూర్తిగా బెడిసికొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com