Kamindu Mendis : మ్యాచ్ కోసం హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్నాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్ నిష్నిని వివాహమాడారు. అంతకుముందే హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ మ్యాచ్ కోసం దాన్ని క్యాన్సిల్ చేసుకుని కోల్‌కతా వచ్చేశారు. ఒకే ఓవర్ వేసిన అతడు ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నారు. 29 రన్స్ చేసి పర్వాలేదనిపించారు. వేలంలో అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.75 లక్షలకు దక్కించుకుంది.
ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత గాడి తప్పింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం పాలైంది. LSGపై 5 వికెట్లు, DCపై 7 వికెట్లు, KKRపై 80 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జట్టులోని ఆటగాళ్లు సమష్ఠిగా రాణించి విజయాలు నమోదు చేయాలని కోరుకుంటున్నారు.
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది. టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. 5 జట్లు 4 పాయింట్లతో, మరో 5 జట్లు 2 పాయింట్లతో నిలిచాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com