World Chess Champion : గుకేశ్ ఎంత ప్రైజ్ మనీ గెలిచారంటే?

World Chess Champion : గుకేశ్ ఎంత ప్రైజ్ మనీ గెలిచారంటే?
X

వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ ట్రోఫీతో పాటు 1.35మిలియన్ డాలర్లు( దాదాపు రూ.11.45కోట్లు) ప్రైజ్ మనీ గెలిచారు. అలాగే, రన్నరప్ డింగ్ లిరెన్ 1.15 మిలియన్ డాలర్లు (రూ.9.75కోట్లు) సొంతం చేసుకున్నారు. మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు వస్తాయి. గుకేశ్ 3 గేమ్‌లు, లిరెన్ 2 నెగ్గగా.. మిగిలిన దాన్ని సమానంగా పంచారు.

18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుతమైన విజయం అందుకున్నందుకు తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని చిరంజీవి ట్వీట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసినందుకు శుభాకాంక్షలు అని డైరెక్టర్ రాజమౌళి, మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలి గ్రాండ్ సెల్యూట్ అంటూ హీరో ఎన్టీఆర్, తదితరులు గుకేశ్‌ను అభినందించారు.

వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్‌ను అత్యధిక సార్లు గెలిచిన దేశంగా సోవియట్ యూనియన్(17) నిలిచింది. రెండో స్థానంలో రష్యా(6), ఇండియా (6), మూడో స్థానంలో నార్వే (5) ఉన్నాయి. USA, ఉక్రెయిన్, చైనా, ఉబ్జెకిస్థాన్, బల్గేరియా ఒక్కో టైటిల్ సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags

Next Story