ROHIT: బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశా: రోహిత్

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ ఒక మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ అద్భుత శతకం చేశాడు. రోహిత్ పనైపోయిందనుకున్న వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి తన ఫిట్‌నెస్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేసేశాడు. మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్‌పై రోహిత్ స్పందించాడు. ‘ఈరోజు మ్యాచ్ చాలా బాగా అనిపించింది. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశా. జట్టు కోసం నిలబడటం, పరుగులు రాబట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గిల్, శ్రేయాస్ నాకు మద్దతుగా నిలిచారు’. అంటూ రోహిత్ శర్మ చెప్పాడు.
చెలరేగిన రోహిత్
రెండో వన్డేలో ఓపెనర్ రోహిత్ ఇంగ్లండ్ బౌలర్లను యధేచ్ఛగా ఆడేసుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ మొదలైన తర్వాత కూడా రోహిత్ జోరు తగ్గలేదు. వరుస బౌండరీలతో 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 26వ ఓవర్‌లో ముందుకు వచ్చి మరీ లాంగాఫ్‌లో బాదిన సిక్సర్‌తో రోహిత్ కెరీర్‌లో 32వ శతకాన్ని పూర్తి చేశాడు. గిల్ కూడా 45 బంతుల్లో ఈ ఫిఫ్టీ సాధించాడు.హిట్‌మ్యాన్ చెలరేగిపోయాడు. విమర్శకుల నోళ్లకు బ్యాటుతో తాళం వేసేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అద్భుత శతకంతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. హిట్ మ్యాన్ సూపర్ సెంచరీకి తోడు గిల్ సమయోచిత అర్ధ శతకంతో భారీ లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించిన టీమిండియా... మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ.. మిలిటరీ చేతికి భద్రత
ఈ నెల 19వ తేదీ నుంచి ICC ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లో జరిగే ఈ టోర్నీకి భద్రతను మిలిటరీ, పారామిలిటరీ రేంజర్స్ పర్యవేక్షించనున్నాయి. ఈ టోర్నీ భద్రతకు సైన్యాన్ని ఉపయోగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి సైతం ఇచ్చింది. లాహోర్, కరాచి, రావల్పిండిలోని హోటళ్లు.. స్టేడియాల వద్ద ఈ బలగాలు భద్రతను చూసుకోనున్నాయి. కాగా, ఈ నెల 23న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.
స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డు
శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టులో స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించారు. గుసాల్ మెండిస్ క్యాచ్ పట్టడంతో 200 క్యాచ్‌లు పట్టిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచారు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 196 క్యాచ్‌లతో రెండో స్థానంలో, మార్క్ వాక్ 181 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నారు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో ట్రోఫీని కైవసం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com