ICC Big Offer : పాక్ కు ఐసీసీ బంపరాఫర్
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా.. ఆ దేశ క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ఐసీసీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పీసీబీ తమ ప్రతిపాదనను అంగీకరిస్తే.. ఆర్థిక ప్రోత్సాహకాలు పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం తాము దయాది దేశానికి వెళ్లలేమని భారత్ ఇప్పటికే ఐసీసీకి సమాచారం ఇచ్చింది. దాంతో ఇప్పటివరకు షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించలేదు.
ఐసీసీ బోర్డు సభ్యులు పాక్‌ను ఒప్పించేందుకు సిద్ధమయ్యారు. ‘‘హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు పాక్ సిద్ధంగా లేదు. ఈ చిక్కుముడిని విప్పేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాం. భారత్‌తో జరిగే మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించాలని, ఒకవేళ టీమిండియా ఫైనల్స్‌కు వస్తే ఆ మ్యాచ్‌ను దుబాయ్‌లో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాం’’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలకు పాక్ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఆడటం.. ఆడకపోవడం భారత్ సమస్య అని ఆ బోర్డు వాదిస్తోంది. మిగిలిన ఆరు జట్లకు లేని ఇబ్బంది భారత్‌కు ఎందుకని ప్రశ్నిస్తోంది. ఒకవేళ తాము హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినా.. గ్రూప్ దశలోని భారత్- -పాక్ మ్యాచ్, ఫైనల్స్‌ను లాహోర్‌లో నిర్వహించాలని పట్టుబడుతోందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సెమీస్, ఫైనల్స్ సహా తాము ఆడే అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే నిర్వహించాలని భారత్ పట్టుబడుతోంది. ఈ అంశంపై పీసీబీ ఛైర్మన్ ఇంతవరకు స్పందించలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com