CRICKET: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు తెలుగు కుర్రాళ్లు

ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరీస్‌కు BCCI భారత జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ 198 శాతానికి పైగా నమోదు చేశాడు. మరో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించాడు. మెల్ బోర్న్ టెస్టులో సెంచరీ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత్ టీమ్‌ను బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్. టీ20 సిరీస్ పూర్తయిన తర్వాత ఈ రెండు టీమ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
షమీ వచ్చేశాడోచ్
స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. దీనిలో షమీకి స్థానం కల్పించింది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగిన షమీ.. అద్భుత ప్రదర్శన చేశాడు. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో బీసీసీఐ సెలక్టర్లు షమీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
వైడ్ బంతుల నిబంధనల్లో ఐసీసీ మార్పులు
బ్యాటర్లకు మాత్రమే కాస్త ప్రయోజనంగా ఉన్న వైడ్ నిబంధనల్లో మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. బౌలర్లకు బెనిఫిట్ దక్కేలా మార్పులు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ బోర్డు భావిస్తోందని మాజీ క్రికెటర్, ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు షాన్ పొలాక్ వెల్లడించాడు. ప్రస్తుతం ఉన్న రూల్స్ వల్ల బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్స్ హవా కొనసాగుతోందని.. బౌలర్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని షాన్ పొలాక్ వ్యాఖ్యానించాడు. ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడిగా తాను ఇదే అంశంపై పని చేస్తున్నానని పోలాక్ తెలిపారు. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు ప్రయోజనం కలిగేలా క్రికెట్ నిబంధనల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పొలాక్ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com