CT2025: ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూపులో భారత జట్టు కాకుండా.. పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈసారి వన్డే ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ గ్రూపులో ఒక్క మ్యాచ్ ఓడినా.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోతాయి. ఏమాత్రం భారీ ఓటమి ఎదురైనా సరే ఆ జట్టు ఇంటిముఖం పట్టాల్సిందే. దీంతో గ్రూపు దశలో ప్రతీ మ్యాచులో టీమిండియా విజయం సాధించాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ మ్యాచులో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై గెలిచి పాక్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్ ఓటమికి ఇప్పుడు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
హర్భజన్ ఆసక్తికర కామెంట్స్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 23న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘భారత్‌పై పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ సగటు 31. అతను టాప్ బ్యాటర్ అయితే సగటు 50 ఉండాలి. ఓపెనర్ ఫకర్ సగటు 46. భారత్ నుంచి మ్యాచ్‌ను దూరం చేయగల సత్తా అతనికి ఉంది. కానీ పాక్ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే భారత్‌కు కనీసం పోటీ కూడా ఇస్తుందన్న నమ్మకం లేదు’ అని చెప్పారు.
టీమిండియాకి షాక్
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. ఈ తరుణంలో టీమిండియాకి గట్టి షాక్ తగిలింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు గాయమైంది. చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ యంగ్ బ్యాటర్.. రంజీ ట్రోఫీ సెమీఫైనల్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కూడా అనుమానంగా మారింది. టోర్నమెంట్‌కు ప్రకటించిన స్క్వాడ్‌లో జైస్వాల్ లేడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com