ICC: డబ్ల్యూటీసీ విజేతకు భారీ ప్రైజ్ మనీ

ICC: డబ్ల్యూటీసీ విజేతకు భారీ ప్రైజ్ మనీ
X
వరల్ట్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంపు

వరల్ట్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రైజ్‌మనీగా 5.76 మిలియన్ డాలర్లు (రూ.49.27 కోట్లు) ఇవ్వబోతున్నారు. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు ఇవ్వనున్నారు. రన్నరప్‌నకు 18.46 కోట్లు అందించనున్నారు. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు రూ.12.31 కోట్లు అందించనున్నారు. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌‌కు రూ.10.26 కోట్లు, ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు రూ. 8.2 కోట్లు ఇవ్వనున్నారు.

ఆదరణ పెంచేందుకే..

టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ ఆదరణ పెంచేందుకు ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఆ రెండేళ్లలో టెస్ట్‌లు ఆడి మెరుగైన విజయాలు సాధించి ర్యాంకింగ్స్‌లో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతన్నాయి. జూన్ 11న లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది.

Tags

Next Story