Imran Tahir : చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ తాహిర్

దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో 500వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో రంగ్‌పూర్ రైడర్స్ , ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య జరిగిన పోరులో తాహిర్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో రంగ్‌పూర్ రైడర్స్ తరుపున ఆడిన తాహిర్ నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
తాహిర్ 44 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. టీ20 ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లో 571 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 624 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా.. కరీబియన్ బౌలర్ సునీల్ నరైన్ మూడో స్థానంలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com