మెరిసిన బుమ్రా, అశ్విన్‌.. మొదటిరోజు మనోళ్ళదే ఆధిపత్యం!

మెరిసిన బుమ్రా, అశ్విన్‌.. మొదటిరోజు మనోళ్ళదే ఆధిపత్యం!
ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ రెండో టెస్టులో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ రెండో టెస్టులో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొదటిరోజు ఆటలో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ని 195 పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. జస్ప్రీత్‌ బుమ్రా 4/56, రవిచంద్రన్ అశ్విన్‌ 3/35, మహ్మద్‌ సిరాజ్‌ 2/40 చెలరేగడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్స్ పెద్దగా రాణించలేకపోయారు. మార్నస్‌ లబుషేన్‌(48), ట్రావిస్‌ హెడ్‌(38) మాత్రమే టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌(28), ఛెతేశ్వర్‌ పుజారా(7) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే ఇన్నింగ్స్ ఆదిలోనే భారత్ కి పెద్ద షాక్ తగిలింది. మయాంక్‌ అగర్వాల్‌ ఖాతా తెరవకుండానే డకౌట్‌గా పెవిలియన్‌ కు చేరాడు. ఆ తరవాత గిల్‌, పుజారా మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. ఇక ఈ సిరీస్ లో ఆసీస్ 1-0 తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story