IND vs AUS: తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 21.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (46*) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఫిలిప్పే (37) ఆకట్టుకున్నాడు. రెన్ షా (21*) పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8)పరుగులకే ఔట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్లలో అర్షదీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఇక రెండో వన్డే గురువారం జరగనుంది.
పటేల్, రాహుల్ ఇద్దరే..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (31) ఫర్వాలేదనిపించాడు. విరాట్ కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11), వాషింగ్టన్ సుందర్ (10), నితీశ్ రెడ్డి (19*) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్‌కు చెరో వికెట్ దక్కింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రో-కో ద్వయం తీవ్రంగా నిరాశపరించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ (8) పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా షాట్లు ఆడి ఇబ్బందులు పడ్డాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లో ఒకటే పరుగు తీసిన రోహిత్, ఆ తర్వాత మూడో ఓవర్లో ఒక ఫోర్ మాత్రమే బాదాడు. అనంతరం హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బంతి ఎడ్జ్ తీసుకుని రెన్షా చేతుల్లోకి వెళ్లడంతో 14 బంతులు ఆడిన రోహిత్ వెనుదిరిగాడు. మరోవైపు వన్డే జట్టుకు నూతన సారథిగా వచ్చిన శుభ్‌మన్ గిల్ తొలి మ్యాచ్‌లోనే ఇబ్బంది పడ్డాడు. ఒత్తిడికి గురై అనవసరంగా లెఫ్ట్ సైడ్ వెళ్లిన బంతిని ఆడి కేవలం 10 పరగులకే వెనుదిరిగాడు. వన్డేల్లో ఈ టాప్-3 బ్యాటర్లు తక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ముగ్గురు కలిపి 18 పరుగులే చేశారు. అంతకుముందు పాక్‌పై 25 పరుగులు (రోహిత్ 11, గిల్ 10, కోహ్లీ 4) చేశారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 21.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (46*) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఫిలిప్పే (37) ఆకట్టుకున్నాడు. రెన్ షా (21*) పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8)పరుగులకే ఔట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్లలో అర్షదీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. ఇక రెండో వన్డే గురువారం జరగనుంది.
చెలరేగిన ఫిలిప్
131 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. 8 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయగా, మాథ్యూషాట్ (8) అక్షర్ పటేల్ వెనక్కి పంపించడంతో ఆసీస్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. వీరిద్దరు తొలుత ఆచితూచి ఆడారు. కుదురుకున్నాక భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరు మూడో వికెట్ కు 55 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని ఫిలిప్‌ను ఔట్ చేయడం ద్వారా వాషింగ్టన్ సుందర్ విడగొట్టాడు. ఫిలిప్ ఔటైనా మాట్ రెన్షా(21 నాటౌట్)తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఏడాది వన్డేల్లో భారత్‌కిది తొలి ఓటమి. వరుసగా ఎనిమిది విజయాల తర్వాత టీమ్ఇండియా పరాజయం చవిచూసింది. 1 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి. 8 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేయగా, మాథ్యూషాట్ (8) అక్షర్ పటేల్ వెనక్కి పంపించడంతో ఆసీస్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. వీరిద్దరు తొలుత ఆచితూచి ఆడారు. కుదురుకున్నాక భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరు మూడో వికెట్ కు 55 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని ఫిలిప్‌ను ఔట్ చేయడం ద్వారా వాషింగ్టన్ సుందర్ విడగొట్టాడు. ఫిలిప్ ఔటైనా మాట్ రెన్షా(21 నాటౌట్)తో కలిసి మిచెల్ మార్ష్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఏడాది వన్డేల్లో భారత్‌కిది తొలి ఓటమి. వరుసగా ఎనిమిది విజయాల తర్వాత టీమ్ఇండియా పరాజయం చవిచూసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com