IND vs ENG: నాలుగో టెస్ట్‌లో పోరాడుతున్న టీమిండియా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టును డ్రా చేసుకునేందుకు టీమ్ఇండియా పోరాడుతోంది. 544/7తో నాలుగో రోజు, శనివారం ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమ్ఇండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0)ను తొలి ఓవర్లోనే క్రిస్ వోక్స్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి భారత్ పరుగుల ఖాతా కూడా తెరవలేదు. దీంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలుతుందేమోనని అభిమానులు కంగారుపడ్డారు.
గోడలా నిలబడ్డ గిల్-రాహుల్
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (78 బ్యాటింగ్; 167 బంతుల్లో 10 ఫోర్లు), కేఎల్ రాహుల్ (87 బ్యాటింగ్; 210 బంతుల్లో 8 ఫోర్లు) ఆదుకోవడంతో టీమ్ఇండియా కోలుకుంది. ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. తొలుత గిల్ దూకుడుగా ఆడాడు. 77 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్న అతను తర్వాత జోరు తగ్గించాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న రాహుల్ ఆరంభంలో ఎక్కువగా సింగిల్స్ తీశాడు. అతను 141 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఐదు ఫోర్లు బాదాడు. చివరి రోజూ కూడా మన బ్యాటర్లు పోరాటం కొనసాగిస్తే భారత్ ఓటమిని తప్పించుకోవచ్చు. నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ మరో 125 రన్స్ చేసి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. 77 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ (141; 198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం చేశాడు. బ్రైడన్ కార్స్ (47; 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. లియామ్ డాసన్ (26) పరుగులు చేశాడు. జో రూట్ (150; 248 బంతుల్లో 14 ఫోర్లు) శతకం చేయగా.. ఓపెనర్లు జాక్ క్రాలీ (84; 113 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (94; 100 బంతుల్లో 13 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71; 128 బంతుల్లో 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, జస్ప్రీత్ బుమ్రా 2, వాషింగ్టన్ సుందర్ 2, అంశుల్ కాంబోజ్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
137 పరుగుల వెనుకంజలో...
మూడో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే చివరి రోజు రెండున్నర సెషన్లు బ్యాటింగ్ చేయాలి. లేదంటే ఈ మ్యాచ్ ఇంగ్లండ్ వశమవుతోంది. ముఖ్యంగా తొలి సెషన్‌ను భారత్ ఆచితూచి ఆడాలి. టీమిండియా ఆటగాళ్లు క్లాస్ బ్యాటింగ్‌తో డ్రా కోసం మాత్రమే ప్రయత్నించాలి.
42 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్‌గా నిలిచాడు. ఈ శతకంతో స్టోక్స్ రికార్డుల మోత మోగించాడు. సిరాజ్ వేసిన 146వ ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించి స్టోక్స్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. స్టోక్స్‌కు ఇది 14వ సెంచరీ. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com