IND vs PAK: భారత్ వర్సెస్ పాక్? ఈసారి జరుగుతుందా..?

IND vs PAK: భారత్ వర్సెస్ పాక్? ఈసారి జరుగుతుందా..?
X
WCL 2025 సెమీస్‌కు భారత్... పాయింట్ల పట్టికలో టాప్‌లో పాక్... భారత్-పాక్‌ తలపడే అవకాశం

వర­ల్డ్ ఛాం­పి­య­న్‌­షి­ప్ లె­జెం­డ్స్‌ 2025లో ఇం­డి­యా ఛాం­పి­య­న్స్‌ సె­మీ­ఫై­న­ల్‌­కు దూ­సు­కె­ళ్లిం­ది. వె­స్టిం­డీ­స్‌­తో మం­గ­ళ­వా­రం జరి­గిన ఆఖరి లీగ్ మ్యా­చ్‌­లో సమ­ష్టి­గా రా­ణిం­చిన యు­వ­రా­జ్ సిం­గ్ సా­ర­థ్యం­లో­ని ఇం­డి­యా ఛాం­పి­య­న్స్ 5 వి­కె­ట్ల తే­డా­తో గె­లు­పొం­దిం­ది. ఈ టో­ర్నీ­లో భా­ర­త్ సా­ధిం­చిన ఏకైక వి­జ­యం ఇదే కా­వ­డం గమ­నా­ర్హం. ఒకే ఒక్క వి­జ­యం సా­ధిం­చి­నా మె­రు­గైన రన్‌­రే­ట్ కా­ర­ణం­గా భా­ర­త్ సె­మీ­స్‌­కు అర్హత సా­ధిం­చిం­ది.

పోలార్ట్ విధ్వంసం

ఈ మ్యా­చ్‌­లో ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన వె­స్టిం­డీ­స్ ఛాం­పి­య­న్స్ ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 9 వి­కె­ట్ల­కు 144 పరు­గు­లు చే­సిం­ది. కీ­ర­న్ పో­లా­ర్డ్(43 బం­తు­ల్లో 3 ఫో­ర్లు, 8 సి­క్స్‌­ల­తో 74) ఒక్క­డే రా­ణిం­చ­గా మి­గ­తా బ్యా­ట­ర్లు దా­రు­ణం­గా వి­ఫ­ల­మ­య్యా­రు. భారత బౌ­ల­ర్ల­లో పి­యూ­ష్ చా­వ్లా (3/18) మూడు వి­కె­ట్లు తీ­య­గా.. వరు­ణ్ ఆరో­న్(2/40), స్టు­వ­ర్ట్ బి­న్నీ(2/17) రెం­డే­సి వి­కె­ట్లు పడ­గొ­ట్టా­రు. పవన్ నే­గి­కి ఓ వి­కె­ట్ దక్కిం­ది.

బిన్నీ, యువీ ధనాధన్

టీ­మిం­డి­యా సె­మీ­స్ చే­రా­లం­టే 14.1 ఓవ­ర్ల­లో­నే లక్ష్యా­న్ని చే­ధిం­చా­ల్సిన పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. కానీ భా­ర­త్ 13.2 ఓవ­ర్ల­లో­నే 5 వి­కె­ట్లు కో­ల్పో­యి 148 పరు­గు­లు చేసి గె­లు­పొం­దిం­ది. స్టు­వ­ర్ట్ బి­న్నీ(21 బం­తు­ల్లో 3 ఫో­ర్లు, 4 సి­క్స్‌­ల­తో 50 నా­టౌ­ట్) హఫ్ సెం­చ­రీ­తో చె­ల­రే­గ­గా.. యు­వ­రా­జ్ సిం­గ్(11 బం­తు­ల్లో 2 ఫో­ర్లు, సి­క్స్‌­తో 21), యూ­స­ఫ్ పఠా­న్(7 బం­తు­ల్లో ఫోర్, 2 సి­క్స్‌­ల­తో 21 నా­టౌ­ట్) మె­రు­పు­లు మె­రి­పిం­చా­రు. విం­డీ­స్ బౌ­ల­ర్ల­లో డ్వే­న్ స్మి­త్(2/27), డ్వే­న్ బ్రా­వో(2/47) రెం­డే­సి వి­కె­ట్లు పడ­గొ­ట్టా­రు.

టాప్‌లో పాక్

ఈ టో­ర్నీ లీగ్ దశలో 5 మ్యా­చ్‌­లు ఆడిన భా­ర­త్ ఒకే ఒక్క వి­జ­యం సా­ధిం­చిం­ది. కానీ మె­రు­గైన రన్‌­రే­ట్‌­తో సె­మీ­స్‌­కు అర్హత సా­ధిం­చిం­ది. ఈ టో­ర్నీ­లో మొ­త్తం 6 జట్లు బరి­లో­కి ది­గ­గా.. నా­లు­గే­సి వి­జ­యా­ల­తో పా­కి­స్థా­న్, సౌ­తా­ఫ్రి­కా ఛాం­పి­య­న్స్ జట్లు టా­ప్‌-2లో ని­లి­చా­యి. రెం­డు వి­జ­యా­ల­తో ఆస్ట్రే­లి­యా ఛాం­పి­య­న్స్ మూడో స్థా­నం­లో ని­ల­వ­గా.. ఇం­డి­యా ఛాం­పి­య­న్స్ మె­రు­గైన రన్‌­రే­ట్‌­తో నా­లు­గో స్థా­నా­న్ని దక్కిం­చు­కుం­ది. ఇం­గ్లం­డ్, వె­స్టిం­డీ­స్ ఒక్కో వి­జ­యం సా­ధిం­చి­నా.. తక్కువ రన్ రేట్ కా­ర­ణం­గా టో­ర్నీ నుం­చి ని­ష్క్ర­మిం­చా­యి.

పాక్‌తో భారత్?

టోర్నీ రూల్స్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో స్థానంలో నిలిచిన టీమ్‌తో సెమీఫైనల్ ఆడాలి. దాంతో పాక్‌తో భారత్ సెమీస్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే లీగ్ దశలో పాకిస్థాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఆడలేమని ఆటగాళ్లు చెప్పారు. దాంతో ఈ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. సెమీస్‌లో మరోసారి ఈ రెండు జట్లు తలపడాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ మ్యాచ్‌ గురువారం జరగనుంది. తొలి మ్యాచ్ తరహాలోనే ఈ సెమీస్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శిఖర్ ధావన్ మాత్రం పాకిస్థాన్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని మీడియాతో అన్నాడు. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు సెమీస్ పోరును మారుస్తారా? లేక పాకిస్థాన్‌‌ను ఫైనల్ చేర్చుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇండియా ఆడటానికి నిరాకరిస్తే, నిబంధనల ప్రకారం పాకిస్తాన్‌కు నేరుగా ఫైనల్ టికెట్ లభిస్తుంది.

Tags

Next Story