IND Vs SA 3rd T20 : తిలక్.. ధనాధన్

IND Vs SA 3rd T20 : తిలక్.. ధనాధన్
X
శతకంతో చెలరిగేన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. మూడో టీ 20లో టీమిండియా ఘన విజయం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ 20లో తెలుగు కుర్రాడు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ తిలక్ వర్మ చెలరేగిపోయాడు. తిలక్ వర్మ చితక్కొకొట్టడంతో సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 219 పరుగులు చేసింది. భారీ స్కోరు ముందున్నా ప్రొటీస్ జట్టు భయపడలేదు చివరి వరకూ పోరాడింది. చివరికి 208 పరుగులకు పరిమితమైంది.

తెలుగోడి సత్తా..

సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయ సెంచరీతో రాణించాడు. ఓపెనర్, తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ ఆఫ్ సైడ్ కళ్లు చెదిరే సిక్సులతో అర్థ శతకం నమోదు చేశాడు. డాషింగ్‌ బ్యాటర్‌ తిలక్‌ కెరీర్‌లో ఇదే తొలి శతకం కావడం విశేషం. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్‌ అభిషేక్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (0)ను జెన్సన్‌ వరుసగా రెండోసారి డకౌట్‌ చేశాడు. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌, అభిషేక్‌ పోటాపోటీగా షాట్లు ఆడుతూ పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 70/1తో భారీ స్కోరుకు బాటలువేసింది. 9వ ఓవర్‌లో కేశవ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొన్న అభిషేక్‌.. ఆ వెంటనే స్టంపౌటయ్యాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (1)ను సిమెలానె స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 110 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.


విధ్వంసకర బ్యాటింగ్

13వ ఓవర్‌లో సింగిల్‌తో తిలక్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడుతున్న తిలక్‌.. 15వ ఓవర్‌లో కేశవ్‌ బౌలింగ్‌లో 4,6,4తో ఒక్కసారిగా గేర్‌ మార్చడంతో టీమ్‌ స్కోరు దూసుకెళ్లింది. ఆ తర్వాతి ఓవర్‌లో కొట్జీ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో చెలరేగిన తిలక్‌ ఏకంగా 21 పరుగులు రాబట్టాడు. బౌండ్రీతో తిలక్‌ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. తిలక్ వర్మ దెబ్బకు చివరి 5 ఓవర్లలో సఫారీలు 65 పరుగులు సమర్పించుకుంది.

సఫారీలు పోరాడినా..

అనంతరం ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. ఓపెనర్లు రికెల్టన్‌ (20), హెండ్రిగ్స్‌ (21) ధాటిగా ఆరంభించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు. రెండు సిక్స్‌లతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మార్‌క్రమ్‌ను వరుణ్‌ క్యాచవుట్‌ చేయడంతో.. 10 ఓవర్లకు సౌతాఫ్రికా 84/4తో ఇబ్బందుల్లో పడింది. క్లాసెన్‌, మిల్లర్‌ (18) ఐదో వికెట్‌కు 58 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. చివరి 30 బంతుల్లో 86 పరుగులు కావల్సి ఉండగా.. మిల్లర్‌ను పాండ్యా అవుట్‌ చేశాడు. ధాటిగా ఆడుతున్న క్లాసెన్‌ను అర్ష్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చడంతో మ్యాచ్‌ టీమిండియాదే అని భావించారు. కానీ, జాన్సన్‌ ఎడాపెడా షాట్లతో భారత శిబిరంలో గుబులు రేపాడు. 19వ ఓవర్‌లో పాండ్యా బౌలింగ్‌లో జాన్సన్‌ 2 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 26 పరుగులు రాబట్టడంతో.. ఆఖరి ఓవర్‌లో లక్ష్యం 25 పరుగులకు దిగివచ్చింది. అయితే, జెన్సన్‌ను అవుట్‌ చేసిన అర్ష్‌దీప్‌ జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.

Tags

Next Story