IND vs SA: నేడే రెండో టీ 20..జోరు మీద భారత్

టీ20 సిరీ్‌సను అదిరే విజయంతో ఆరంభించిన భారత్.. అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ20లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కటక్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టినా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వైఫల్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గాయంతో వన్డే సిరీ్‌సకు దూరమైన అతడు తగిన విశ్రాంతి తర్వాత బరిలోకి దిగినా.. స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మకు అతడు ఏమాత్రం సరితూగడం లేదు. గిల్ రాకతో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు కష్టమవుతుండడం కూడా అతడిపై ఒత్తిడికి కారణమవుతోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన జితేష్ శర్మకు బదులుగా సంజూ శాంసన్‌ను తీసుకోవాలని సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. కీపర్ బెర్త్ కోసం వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఇక, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై కూడా ఆందోళన నెలకొంది. పొట్టి వరల్డ్‌కప్ నేపథ్యంలో సూర్య తన మునుపటి విధ్వంసకర బ్యాటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, గాయం నుంచి కోలుకొన్న హార్దిక్ పాండ్యా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ అర్ధ శతకంతో అదరగొట్టాడు. అతడి నుంచి జట్టు ఇదే తరహా ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది. అయితే, బ్యాటింగ్ డెప్త్ కావాలనుకొంటే అర్ష్‌దీప్ స్థానంలో హర్షిత్ రాణాను తీసుకొనే చాన్సులున్నాయి. ఒకవేళ పిచ్ పొడిగా ఉంటే మాత్రం జట్టులో ఎటువంటి మార్పులూ ఉండే అవకాశం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా బలంగా పుంజుకోవాలనుకొంటోంది. బ్రెవిస్ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడం జట్టును కలవరపెడుతోంది.
పట్టుదలతో..
తొలి మ్యాచ్‌లో ఘోరపరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉంది. ఆ జట్టును భారత్ తేలికగా తీసుకుంటే పొరపాటే. అయితే సిరీస్‌ను సమం చేయాలంటే బ్యాటుతో సఫారీ జట్టు గణనీయంగా మెరుగుపడాల్సివుంది. కటక్‌లో ఆ జట్టు 74 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌ను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సవాలే.
కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కాలంగా నిలకడగా ఆడలేకపోతున్న అతడిపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. ఇంకొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్‌లో సూర్య జట్టును నడిపించనున్న నేపథ్యంలో అతడు పరుగుల బాట పట్టడం చాలా అవసరం. కటక్‌లో అతడు 12 పరుగులే చేశాడు. పేలవ ఫామ్‌ను అధిగమించడానికి సూర్యకు ఈ సిరీస్ ది చక్కని అవకాశం. రెండో టీ20 కోసం తుది జట్టులో టీమ్ఇండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పునరాగమనంలో తొలి మ్యాచ్‌లోనే చెలరేగడం భారత్‌కు సంతోషాన్నిస్తోంది. కటక్‌లో కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు చేసిన అతడు.. మరోసారి మెరవాలని జట్టు కోరుకుంటోంది. ఇంకా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, దూబె, జితేశ్ శర్మలతో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. ఇక బౌలర్లు గత మ్యాచ్‌లో సమష్టిగా విజృంభించడం భారత్‌కు సానుకూలాంశమే. పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌తో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్.. సఫారీ జట్టును దెబ్బతీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

