IND vs SA: టీమిండియా పుంజుకుంటుందా?

IND vs SA: టీమిండియా పుంజుకుంటుందా?
X
మూడో టీ20కు టీమిండియా సిద్ధం... ఆత్మ విశ్వాసంతో ఉన్న దక్షిణాఫ్రికా... ఆధిక్యంపై కన్నేసిన ఇరు జట్లు

తొలి టీ20 భా­ర­త్ గె­లి­చిం­ది. రెం­డో టీ20 సౌ­తా­ఫ్రి­కా నె­గ్గిం­ది. ఐదు టీ20ల సి­రీ­స్‌­లో ఇరు జట్లు 1-1 సమ­వు­జ్జీ­లు­గా ఉన్నా­యి. నేడు ధర్మ­శాల వే­ది­క­గా మూడో టీ20 జర­గ­నుం­ది. ఈ మ్యా­చ్‌­లో గె­లి­చి లీ­డ్‌­లో­కి వె­ళ్లా­ల­ని టీ­మిం­డి­యా పట్టు­ద­ల­తో ఉంది. గత మ్యా­చ్‌­లో భారత జట్టు ప్ర­ద­ర్శన ఏమా­త్రం ఆమో­ద­యో­గ్యం­గా లేదు. ముం­దు­గా బం­తి­తో.. ఆ తర్వాత బ్యా­టు­తో చే­తు­లె­త్తే­సి ఘోర పరా­జ­యా­న్ని చవి­చూ­సిం­ది. ఓటమి కంటే భారత ప్లే­య­ర్ల ఆడిన తీరు కా­స్త ఆం­దో­ళ­న­క­రం­గా­నే ఉంది. కా­బ­ట్టి, మూడో టీ20లో భారత జట్టు లో­పా­ల­ను సరి­ది­ద్దు­కు­ని మె­రు­గు­ప­డా­ల్సిన అవ­స­రం ఉంది. కె­ప్టె­న్‌ సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్, వై­స్‌ కె­ప్టె­న్‌ శు­భ్‌­మ­న్‌ గి­ల్‌ల ఫామే భా­ర­త్‌­కు అతి పె­ద్ద సమ­స్య­గా మా­రిం­ది. ము­ఖ్యం­గా గి­ల్‌ ఈ సి­రీ­స్‌­లో అవ­కా­శా­ల­ను సద్వి­ని­యో­గం చే­సు­కో­లే­క­పో­తే జట్టు­లో చోటు గల్లం­త­వ­డం ఖాయం. బ్యా­టిం­గ్‌ ఆర్డ­ర్లో ప్ర­యో­గా­ల­తో తీ­వ్ర వి­మ­ర్శ­లు ఎదు­ర్కొం­టు­న్న జట్టు యా­జ­మా­న్యం.. ఈ మ్యా­చ్‌­లో ఎవ­రి­ని ఏ స్థా­నం­లో ఆడి­స్తుం­ద­న్న­ది ఆస­క్తి­క­రం. బా­రా­బ­టి­లో ఘోర పరా­భ­వం తర్వాత, చం­డీ­గ­ఢ్‌­లో బలం­గా పుం­జు­కు­న్న సఫా­రీ జట్టు.. ధర్మ­శా­ల­లో మరో వి­జ­యం సా­ధిం­చా­ల­నే పట్టు­ద­ల­తో ఉంది.

జోరు కొనసాగించాలని..

తొలి టీ20లో కే­వ­లం 74 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిన దక్షి­ణా­ఫ్రి­కా.. రెం­డో మ్యా­చ్‌­లో 213 పరు­గు­లు చే­య­డం అనూ­హ్యం. దీం­తో ఇక ఆ జట్టు­ను భా­ర­త్‌ తే­లి­గ్గా తీ­సు­కు­నే అవ­కా­శం లేదు. డి­కా­క్‌ జో­రం­దు­కుం­టే ఎలా ఉం­టుం­దో చి­వ­రి వన్డే­లో, రెం­డో టీ20లో భా­ర­త్‌­కు బా­గా­నే అను­భ­వ­మైం­ది. రెం­డో టీ20లో మా­ర్‌­క్ర­మ్, డొ­నో­వ­న్‌ ఫె­రీ­రా కూడా మె­రు­పు ఇన్నిం­గ్స్‌­లు ఆడా­రు. వీ­రి­కి తోడు హెం­డ్రి­క్స్, బ్రె­వి­స్, మి­ల్ల­ర్‌­ల­తో దక్షి­ణా­ఫ్రి­కా బ్యా­టిం­గ్‌ బలం­గా ఉంది. చం­డీ­గ­ఢ్‌­లో సఫా­రీ బౌ­ల­ర్లు కూడా అద­ర­గొ­ట్టా­రు. పే­స­ర్లు బా­ర్ట్‌­మ­న్, ఎం­గి­డి, యా­న్సె­న్‌ కలి­పి 8 వి­కె­ట్లు తీ­శా­రు. మరో­సా­రి పే­స్‌­పై­నే ఆ జట్టు ఆశలు పె­ట్టు­కుం­ది. ధర్మ­శా­ల­లో పరి­స్థి­తు­లు కూడా పే­స్‌­కు సహ­క­రి­స్తా­యి కా­బ­ట్టి భారత బ్యా­ట­ర్లు జా­గ్ర­త్త పడా­ల్సిం­దే. టీ20 వర­ల్డ్ కప్‌­కు ఇం­కెం­తో సమయం లేదు. ఈ పరి­స్థి­తు­ల్లో కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్, శు­భ్‌­మ­న్ గిల్ ఫామ్ జట్టు­ను టె­న్ష­న్ పె­డు­తోం­ది. కొం­త­కా­లం­గా వీ­రి­ద్ద­రూ టీ20ల్లో పేలవ ఫా­మ్‌­తో జట్టు­కు భా­రం­గా మా­రా­రు. టీ20ల్లో సూ­ర్య హాఫ్ సెం­చ­రీ చేసి ఏడా­ద­వు­తోం­ది. ఈ సి­రీ­స్‌­లో సూ­ర్య, గిల్ ప్ర­ద­ర్శన పే­ల­వం­గా ఉంది. సూ­ర్య వరు­స­గా 12, 5 రన్స్ చే­య­గా.. గిల్ 4, 0 పరు­గు­లు చే­శా­డు. ఈ మ్యా­చ్‌­లో టాస్ కీ­ల­కం కా­నుం­ది. రెం­డో ఇన్నిం­గ్స్‌­లో మంచు ప్ర­భా­వం తీ­వ్రం­గా ఉం­డ­ట­మే అం­దు­కు కా­ర­ణం. మంచు కా­ర­ణం­గా రెం­డో ఇన్నిం­గ్స్‌­లో బౌ­లిం­గ్ చే­య­డం చాలా కష్ట­త­రం. కా­బ­ట్టి, చే­జిం­గ్ సు­ల­భ­త­రం కా­నుం­ది.

Tags

Next Story