Ind vs Ban : టీ20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్ ల టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ సారథ్యం వహిస్తున్న ఈ 15 మంది సభ్యుల బృందంలో యువ పేసర్ మయాంక్ యాదవ్‌కు తొలిసారి చోటు దక్కింది. ఈ ఐపీఎల్ సీజన్లో 150 కి.మీపైన వేగంతో స్థిరంగా బంతులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన 22 ఏళ్ల మయాంక్.. గాయంతో టోర్నీ మధ్యలో వైదొలిగాడు. ఇప్పుడు కోలుకుని మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపికైనా.. గాయంతో అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయిన తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డికి సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు. అతడు చివరిగా 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. ఐపీఎల్‌లో సత్తా చాటిన రియాన్ పరాగ్, అభిషేక్‌శర్మ, హర్షిత్ రాణాల కూడా బంగ్లాతో సిరీస్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ జట్టులో సూర్య కాకుండా హార్దిక్ పాండ్య మాత్రమే సీనియర్. భారత్-బంగ్లా మధ్య తొలి టీ20 అక్టోబర్ 6న గ్వాలియర్‌లో.. రెండు, మూడో టీ20లు 9న ఢిల్లీ, 12న హైదరాబాద్‌లో జరుగుతాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్‌శర్మ, సంజు శాంసన్, రింకుసింగ్, హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com