IND VS ENG: తొలి వన్డే టీమిండియాదే

నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. భారత్ 38.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించారు. అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 రన్స్ చేశారు. దీంతో జరిగిన ఈ తొలి వన్డేలో భారత్ మరో 11.2 ఓవర్లుండగానే 4 వికెట్ల తేడాతో బోణీ చేసింది.
కట్టడి చేసిన భారత బౌలర్లు
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి బ్రిటీష్ జట్టు 47.4 ఓవర్లకు ఇంగ్లండ్ బ్యాటర్లు 247 పరుగులకే పరిమితమైంది. జాకబ్ బెథెల్ 37, సాల్ట్ 43, జోస్ బట్లర్ 52 పరుగులు చేశారు. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్ సాల్ట్ దూకుడైన ఆటతీరుతో టీమిండియాను భయపెట్టాడు. రాణా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సాల్ట్... 6,4,6,4,0,6తో 26 పరుగులను రాబట్టి భారత జట్టులో భయం పెంచాడు. డకెట్ కూడా మంచి సహకారం అందించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి తొమ్మిదో ఓవర్‌లో బ్రేక్ పడింది. మూడో రన్ కోసం ప్రయత్నించిన సాల్ట్.. శ్రేయాస్ త్రోతో రనౌట్‌గా వెనుదిరగ్గా తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే డకెట్, బ్రూక్ (0)లను రాణా అవుట్ చేయడంతో బ్రిటీష్ జట్టు స్కోరు మందగించింది. రూట్ (19) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాక బట్లర్, బెథెల్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బట్లర్ 31వ ఓవర్‌లో అర్ధసెంచరీ పూర్తి చేసిన కాసేపటికే అక్షర్‌కు చిక్కడంతో ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బెథెల్ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. జడేజా పొదుపైన బౌలింగ్‌తో మరో నాలుగు ఓవర్లలోనే ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
అలవోకగా
248 పరుగుల ఛేదనలో భారత్ 19 పరుగులకే ఓపెనర్లు రోహిత్ (2), జైస్వాల్ (15) వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరడం భారత జట్టును ఆందోళన పరుస్తోంది. కానీ గిల్, శ్రేయస్స్ అయ్యర్ భారత్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో టీమిండియా 21.2 ఓవర్లకు 3 వికెట్లకు 144 పరుగులకు చేరుకుని విజయం ఖాయం చేసుకుంది. ఛేదనలో వైస్ కెప్టెన్ గిల్ (87), శ్రేయాస్ (59), అక్షర్ (52) కీలక అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో తొలి వన్డేలో భారత్ మరో 11.2 ఓవర్లుండగానే బోణీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com