RINKU: ఎంపీతో రింకూసింగ్ పెళ్లి

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. సమాజ్‌వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడి వివాహం ఖరారైనట్టు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 16న రింకూ తండ్రితో పెళ్లి గురించి మాట్లాడినట్టు ప్రియ సరోజ్ తండ్రి , ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ వెల్లడించారు. పెళ్లికి ఇరు కుటుంబాలు సమ్మతి తెలియజేశాయన్నారు.
ఎంపీతో రింకూ లవ్ స్టోరీ నడిపాడా..?
భారత క్రికెటర్, టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్.. ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని వధువు తరఫు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. వారిద్దరికీ ఇప్పటికే పరిచయం ఉన్నట్లు, ఒకరినొకరు ఇష్టపడినట్లు వెల్లడించారు. ప్రియా తన స్నేహితుల ద్వారా రింకూ సింగ్‌ను కలిశారని.. ఇద్దరి మధ్య ఏడాది కంటే ఎక్కువే పరిచయముందని.. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలిపారు.
కొడుకు కొనిచ్చిన బైక్ పై...
రింకూ సింగ్ తండ్రి ఖన్‌చంద్ర సింగ్ అలీగఢ్ వీధుల్లో కవాసాకి నింజా స్పోర్ట్స్ బైక్‌పై రయ్..రయ్ మంటూ దూసుకెళ్తున్నాడు. గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేసే ఖన్‌చంద్ర రూ. 5 లక్షల ఖరీదైన బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్న వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అయితే, ఈ బైక్‌ను తన తండ్రికి రింకూ బహుమతిగా ఇచ్చాడట. తండ్రికి ఖరీదైన బైక్‌ను కొనిచ్చిన రింకూపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
డబ్బులు పంచిన రింకూ సింగ్
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఈ స్టార్ ప్లేయర్.. సిబ్బందికి డబ్బు పంపిణీ చేయడం కనిపిస్తుంది. అయితే రింకూ కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు. ఈ సమయంలో రింకూ.. చెఫ్, వెయిటర్‌తో సహా క్రీడా సిబ్బంది అందరికీ డబ్బు పంచారు. దానం చేయడంలో రింకూ సింగ్ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com