PARAOLYMPICS: కొత్త చరిత్రను లిఖించేశారు...

పారిస్ పారాలింపిక్స్ 2024లో పురుషుల హైజంప్ ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ప్రవీణ్ 2.08 మీటర్ల అద్భుతమైన జంప్ చేసి భారత్‌కు మెడల్ అందించారు. అమెరికాకు చెందిన లోసిడెంట్ రజతం సాధించారు. యూపీలోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ మరియప్పన్ తంగవేలు తర్వాత పారాలింపిక్స్‌లో హైజంప్ ఈవెంట్‌లలో స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడుగా ప్రవీణ్ నిలిచారు. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 27కి పెరిగింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్య పతకాలున్నాయి.
మెరిసిన ప్రవీణ్
టీ64 హైజంప్ పోటీల్లో 2.08మీటర్ల ఎత్తు జంప్ చేసి ప్రవీణ్ పసిడి పతకం నెగ్గాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హైజంప్ రికార్డు కావడం విశేషం. కాగా.. పారాలింపిక్స్‌లో ప్రవీణ్ వరుసగా రెండో పతకం సాధించాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21ఏళ్ల అథ్లెట్.. 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించాడు. అతిచిన్న వయసులోనే ఒలింపిక్ పతకం సాధించిన పారా అథ్లెట్‌గా అప్పుడు చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్ హైజంప్ పోటీల్లో భారత తరఫున స్వర్ణం సాధించిన రెండో ఆటగాడు ఇతడే. అంతకుముందు మరియప్పన్ తంగవేలు ఈ పోటీల్లో పసిడి నెగ్గాడు. ఇక, పారిస్ పోటీల్లో పతకం నెగ్గిన మూడో హైజంపర్‌గా నిలిచాడు. ఈ ఏడాది జరుగుతున్న పోటీల్లో ఇప్పటికే హైజంప్ టీ-63 విభాగంలో శరద్ కుమార్ రజతం (1.88 మీటర్లు), తంగవేలు మరియప్పన్ కాంస్యం (1.85 మీటర్లు) సాధించారు.
ప్రవీణ్ కుమార్ స్వర్ణ పతకం సాధించడంతో పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం 19 పతకాలను మాత్రమే గెలుచుకుంది. ఇందులో 5 బంగారు పతకాలు ఉన్నాయి. ఈసారి పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 27 పతకాలను కైవసం చేసుకుంది. తాజాగా ఆరో స్వర్ణం దక్కించుకుంది. పారిస్ పారాలింపిక్స్‌లో అవనీ లఖేరా, నితేష్ కుమార్, సుమిత్, హర్విందర్ సింగ్, ధరంబీర్, ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున బంగారు పతకాలు సాధించారు. ప్రవీణ్ కుమార్ ఇంతకు ముందు టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com