Asia Champions Trophy : ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ .. పాక్ ను చిత్తు చేసిన భారత్

Asia Champions Trophy : ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ .. పాక్ ను చిత్తు చేసిన భారత్
X

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్‌ చిత్తు చేసింది. శనివారం గ్రూప్‌ దశలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దాయాదిని 2-1తో మట్టికరిపించింది.టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్ సెమీస్ చేరుకున్న విషయం తెలిసిందే. భారత్‌తో పాటుగా కొరియా, పాకిస్థాన్ జట్లు సెమీస్ అర్హత సాధించాయి. నాలుగో స్థానం కోసం మలేషియా, చైనా జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక జట్టు సెమిస్ కు అర్హత సాధిస్తుంది. కాగా సెమీఫైనల్ మ్యాచ్‌లు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి.

Tags

Next Story