ఏషియన్ చాంపియన్స్ ట్రోఫిలో టీమ్ హాకీ ఇండియా హవా

చైనాలో జరుగుతున్న ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఫస్ట్ మ్యాచ్ లో చైనాను 3-0తో ఓడించిన భారత్.. ఆ తర్వాత జపాన్‌ని 5-1తో చిత్తు చేసింది. బుధవారం మలేషియాను 8-1 తేడాతో ఓడించి మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత్ తరఫున రాజ్‌కుమార్ పాల్ (3వ, 25వ, 33వ నిమిషం), అరైజీత్ సింగ్ హుందాయ్ (6వ, 39నిమిషం), పెనాల్టీ కార్నర్ ద్వారా జుగ్‌రాజ్ సింగ్ (7వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (40వ నిమిషం) గోల్స్ చేశారు. మలేషియా తరఫున అనౌల్ అఖిముల్లా (34వ నిమిషం) గోల్ చేశాడు. అయితే.. ఈ మ్యాచ్ తొలి మూడు క్వార్టర్స్‌లో రాజ్ కుమార్ హ్యాట్రిక్ కొట్టగా, మొదటి, మూడో క్వార్టర్స్‌లో హుందాయ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. పెనాల్టీ కార్నర్ నుంచి హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్ స్కోర్‌షీట్‌లోకి ప్రవేశించగా.. ఉత్తమ్ ఎనిమిది, చివరి గోల్‌ను సాధించాడు. దీంతో మలేసియా మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌లు ఓడి.. మరోటి డ్రా చేసుకుంది. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 12న భారత్ దక్షిణ కొరియాతో ఆడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com