India - England : భారత్ - ఇంగ్లాండ్ రెండో టెస్టు..తుది జట్టులో ఆ ఇద్దరు..

భారత్ - ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2న ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున బరిలోకి దిగే 11మంది ఎవరనేది ఆసక్తిగా మారింది. భారత్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారని చెప్పాడు. ఆ స్పిన్నర్ ఎవరు అనేదానిపై ఉత్కంఠ వీడింది.
వాషింగ్టన్ సుందర్ రెండో టెస్ట్‌లో టీమిండియా తరపున బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సుందర్ స్పిన్ ఆల్ రౌండర్. సుందర్ , మరో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడ్జ్‌బాస్టన్‌లో పోటీకి దింపాలని మేనేజ్ మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జస్‌ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అతడికి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడాలని భావించిన కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్లుగా ఆడుతుండడంతో కుల్దీప్‌కు అవకాశం లభించే అవకాశం లేదు.
ఇక్కడ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో వాషింగ్టన్ సుందర్ రావడం దాదాపు ఖాయం. కానీ నితీష్ కుమార్ రెడ్డిని ఎవరి స్థానంలో ఎంపిక చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. నితీశ్ ప్లేయింగ్ XIలో కనిపిస్తే.. శార్దూల్ ఠాకూర్ లేదా ప్రసీద్ధ్ కృష్ణకు ఉద్వాసన తప్పదు.
భారత జట్టు అంచనా :
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com