India-Pakistan: వరల్డ్‌కప్‌లో ఇండియా, పాక్ మ్యాచ్ వాయిదా..!

India-Pakistan: ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఇరుదేశాల అభిమానుల భావోగ్వేదాలతో మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రపంచవ్యాప్త అభిమానులు కూడా మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు.భారత్, పాక్ క్రికెట్ పోరును అన్ని క్రికెట్ మ్యాచ్‌లకు తల్లిలాంటిదిలా(Mother Of All Matches) అభివర్ణిస్తారు.
అయితే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న ఖరారైంది. ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. నవరాత్రుల సందర్భంగా నవరాత్రుల్లోని మొదటి రోజే మ్యాచ్ ఖరారు చేశారు. ఆ రోజున గుజరాత్ వ్యాప్తంగా ప్రజలు ప్రముఖ గర్భా నృత్యాలతో కోలాహలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ తేదీని మార్చవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే జరిగితే ముందే టికెట్లు, రూంలు బుక్ చేసుకున్న అభిమానులు తమ కార్యకలాపాలను వాయిదా వేసుకున్న వారికి తీవ్ర ఇబ్బందే. ఇండియా, పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్, ఇతర ప్రాంతాల్లో వసతి గదులకు లక్షల్లో ఖర్చు చేశారు. ఇప్పుడు మ్యాచ్ తేదీ మారిస్తే అభిమానులు నిట్టూర్పు తప్ప మరో దారి లేదు.
"నవరాత్రి నేపథ్యంలో భద్రతా సంస్థలు ఇండియా, పాక్ మ్యాచ్ తేదీని మార్చమని సూచించారు. దీంతో మ్యాచ్ వాయిదా పడవచ్చు. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం. దీనిపై నిర్ణయం అంత తేలికైంది కాదు, ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. భద్రతా కోణంలో తప్పక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తప్పకుండా మారుస్తాం" అని ఈ అంశానికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి.
1 లక్ష సామర్థ్యం కలిగిన నరేంద్ర మోదీ స్టేడియం దాయాదుల పోరుతో పాటు, టోర్నీ మొదటి మ్యాచ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్, ఫైనల్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com