CRICKET: సంజు శాంసన్ ఊచకోత

బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లోనూ విజయ ఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేసిన భారత్.. బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మూడో టీ20లో భారత్ 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సెంచరీ(111), సూర్యకుమార్ హాఫ్ సెంచరీల(75)తో చెలరేగగా.. పాండ్యా 47, రియాన్ పరాగ్ 34 రన్స్ చేశారు. సంజూ శాంసన్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో రోహిత్ శర్మ 100 (35 బంతుల్లో) తర్వాత అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, టీ20ల్లో వేగంగా సెంచరీతో చేసిన వారిలో డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో), రోహిత్ (35), జాన్సన్ చార్లెస్ (39) తొలి మూడు స్థానాల్లో ఉండగా సంజు (40) నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా, టీ20ల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఉన్న 260 పరుగుల రికార్డును అధిగమించింది.
కుప్పకూలిన బంగ్లా
298 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 రన్స్ మాత్రమే చేసింది. హిర్దోయ్(63), దాస్(42) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత్ బౌలర్లలో బిష్ణోయ్ 3, మయాంక్ 2, సుందర్, నితీష్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా
ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన మూడో T20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించి పలు రికార్డులను నమోదు చేసింది. *టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే (297) *టీ20ల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యధిక స్కోర్ (297) *భారత్ ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు (22) *భారత జట్టు తరఫున ఫాస్టెస్ట్ 100(7.2 ఓవర్లు) *భారత తరఫున ఫాస్టెస్ట్ 200(13.6 ఓవర్లు).
రికార్డుల మోత
భారత్ రికార్డుల మోత మోగించింది. 47 బౌండరీలు బాది టీ20ల్లో అత్యధిక బౌండరీల రికార్డు నమోదు చేసింది. టెస్టు హోదా ఉన్న జట్టు టీ20ల్లో చేసిన అత్యదిక స్కోర్ (297) ఇదే. టీ20ల్లో బెస్ట్ పవర్ ప్లే స్కోర్ (82/1). 7.1 ఓవర్లలోనే వేగవంతంగా 100 పరుగులు సాధించింది. మొదటి 10 ఓవర్లలోనే 146/1 బెస్ట్ స్కోర్ చేసింది. టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు. టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన రెండో టీమ్‌గా రికార్డు నెలకొల్పింది. 14 ఓవర్లలోనే 200 పరుగులు చేసి వేగవంతమైన స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లోనే ఆటగాళ్లు అత్యధికంగా 22 సిక్సర్లు బాదారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com