KOHLI: మరొకరికి కోహ్లీ జెర్సీ.. బీసీసీఐపై ఆగ్రహం

KOHLI: మరొకరికి కోహ్లీ జెర్సీ.. బీసీసీఐపై  ఆగ్రహం
X
సచిన్‌ జెర్సీలానే వీడ్కోలు పలకాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు

విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడంతో అతడి నెంబర్ 18 జెర్సీని ఇంగ్లాండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత 'ఎ' జట్టు పేసర్ ముఖేష్ కుమార్ ధరించాడు. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సచిన్ నెం.10 జెర్సీకి వీడ్కోలు పలికిన విధంగానే, కోహ్లీ గౌరవార్థం నెం.18 జెర్సీని కూడా ఇంకెవరికీ కేటాయించకుండా రిటైర్ చేయాలని పలువురు BCCIని డిమాండ్ చేస్తున్నారు. , ఇంగ్లాండ్ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ముఖేష్ కుమార్ అదే 18వ నంబర్ జెర్సీతో కనిపించడంతో, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది కోహ్లీని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడ్కోలు పలకాల్సిందే

సచిన్ టెండూల్కర్ 10వ నంబర్ జెర్సీకి వీడ్కోలు పలికిన విధంగానే, కోహ్లీ గౌరవార్థం 18వ నంబర్ జెర్సీని కూడా ఇంకెవరికీ కేటాయించకుండా రిటైర్ చేయాలని పలువురు బీసీసీఐని డిమాండ్ చేశారు. "విరాట్ కోహ్లీ 18వ నంబర్ జెర్సీని ముఖేష్ కుమార్ ధరించాడా? అతనికి ఎంత ధైర్యం? అతని ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏంటి?" అంటూ ఒక అభిమాని చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది కోహ్లీ వీరాభిమానుల మనోభావాలను ప్రతిబింబిస్తోంది. సాధారణంగా ముఖేష్ కుమార్ గతంలో ఆడిన మ్యాచ్‌లలో 49వ నంబర్ జెర్సీని ధరించేవాడు. ఇప్పుడు ఈ జెర్సీ మార్పు ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక నిర్వాహకుల పొరపాటా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

Tags

Next Story