Ind vs SL : ఘోర ఓటమి.. 27 ఏళ్ల తర్వాత సిరీస్ కోల్పోయిన భారత్

శ్రీలంకతో చివరి వన్డేలో భారత్ 110 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 249 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ 35, సుందర్ 30, కోహ్లీ 20, పరాగ్ 15 రన్స్ మినహా మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో వెల్లలగే 5 వికెట్లతో చెలరేగారు. ఈ ఓటమితో భారత్ 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. కాగా 27 ఏళ్ల తర్వాత లంకపై భారత్ సిరీస్‌ను మిస్ చేసుకుంది.
భారత క్రికెట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే టీమ్ఇండియా ఘోరంగా ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్ కోల్పోవడంతో గంభీర్‌పై విమర్శలొస్తున్నాయి. ఇతరులకంటే భిన్నంగా ఉండేందుకు అనవసర ప్రయోగాలు చేయడం మానేయాలని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
యువ సంచలనాలతో శ్రీలంక అదరగొట్టింది. పతిరణ, హసరంగ, మధుశంక, తుషార, చమీరా, ఫెర్నాండో వంటి సీనియర్ ప్లేయర్లు లేకున్నా బలమైన టీమ్ ఇండియాపై విజయం సాధించింది. తమ బలమైన స్పిన్ విభాగంతో రోహిత్ సేనను కట్టడి చేసింది. ముఖ్యంగా యువ ఆల్‌రౌండర్ వెల్లలగే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com