BGT: ఆస్ట్రేలియా చేతికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆస్ట్రేలియాకు దక్కింది. ఐదో టెస్టులో భారత్ ఓటమిపాలవడంతో ఆసీస్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 162 లక్ష్యాన్ని ఛేదించింది. ఖవాజా 41, హెడ్ (34*), వెబ్‌స్టర్ (39*) కీలకమైన రన్స్ నమోదు చేశారు. సామ్ కొనస్టాస్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
157 పరుగులకు భారత్ ఆలౌట్
బోర్డర్ - గవస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియాతో పోటీ పడుతున్న భారత్ మూడో మ్యాచ్‌లో 141/6 స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 157 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ (61) పరుగులతో రాణించారు. దీంతో భారత్ కేవలం 161 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఓటమిపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
టీమ్ ఇండియా పేస్ బౌలర్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ టెస్ట్ సిరీస్ ఓటమిపై ఆయన స్పందించారు. 'ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. ఒత్తిడిని ఎదుర్కొనడం నేర్చుకున్నారు. ఈ అనుభవం వారి కెరీర్‌కు ఎంతో కీలకంగా మారనుంది. సిరీస్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు' అని బుమ్రా అన్నారు.
రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు వార్తలు ఎక్కువయ్యాయి. తాజాగా ఈ వార్తలపై రోహిత్ స్పందిస్తూ.. 'రిటైర్మెంట్ వార్తలను ఖండిస్తున్నాను. ప్రస్తుతం నా ఫోకస్ వర్తమానంపైనే ఉంది. ఐదో టెస్టులో తప్పుకుంటే రిటైర్మెంట్ తీసుకున్నట్టు కాదు. ప్రస్తుతం పరుగులు చేయడం లేదు కాబట్టే సిడ్నీ టెస్టుకూ దూరమయ్యాను. కానీ నేను ఆటకు దూరం కాను' అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com