U19 WorldCup: అదరగొట్టిన యువ భారత్

U19 WorldCup: అదరగొట్టిన యువ భారత్
X
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన మహిళల జట్టు

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్ బెర్త్ ను యువ భారత్ ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 113 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళలు వికెట్‌ నష్టపోయి.. 15 ఓవర్లలోనే చేధించారు. టోర్నీ అంతటా మంచి ఫామ్‌ కనబరిచిన భారత ఓపెనర్లు.. సెమీస్‌లోనూ అదరగొట్టారు. ఓపెనర్లు కమలిని (56*), గొంగడి త్రిష (35) రాణించారు. దీంతో ఆదివారం జరగనున్న టైటిల్‌ పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఓపెనర్లు కమలిని- గొంగడి త్రిష తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి జట్టు విజయానికి పునాది వేశారు. ఈ క్రమంలో త్రిష ఔటైనప్పటికీ భారత ఇన్నింగ్స్‌ను సనికా చల్కే (11*)తో కలిసి కమలిని ముందుకు తీసుకెళ్లింది. కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.

మరోసారి మెరిసిన త్రిష

అండర్ 19 ప్రపంచ కప్ లో తెలుగు తేజం గొంగిడి త్రిష సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచులో త్రిష మరోసారి సత్తా చాటింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 113 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు త్రిష శుభారంభం అందించింది. 29 బంతుల్లో 5 ఫోర్లతో త్రిష 35 పరుగులు చేసింది. దీంతో యువ భారత్ విజయం సాధించింది. కమలిని అజేయ అర్థ శతకంతో భారత్ కు సునాయస విజయం అందించింది. త్రిష ఔటైనప్పటికీ.. సనికా చల్కే (11 నౌటౌట్), కమలిని జోడి మిగిలిన పనిని పూర్తి చేశారు.

బౌలింగ్ లో సత్తా చాటిన బౌలర్లు

టాస్ నెగ్గి బ్యాటింగ్‌ను ఎంచుకున్న ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు హడలెత్తించారు. ఓపెనర్‌ డేవినా పెరిన్ (45) కాసేపు మెరుపులు మెరిపించినా.. ఆమె ఔట్ అయ్యాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. భారత బౌలర్లలో పరుణికా సిసోదియా (3), వైష్ణవి శర్మ (3), ఆయుషి శుక్లా (2) వికెట్లు పడగొట్టారు. ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.

Tags

Next Story