India Vs Pakistan: బూమ్రా "రాఫెల్" సెలబ్రేషన్స్

టీమ్‌ఇండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకుంది. తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుతంగా పోరాడడంతో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అయితే బుమ్రా సెలబ్రేషన్స్ మరోసారి వైరల్ గా మారింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హారిస్ రవూఫ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన భారత స్టార్ పేసర్ బుమ్రా ఎప్పట్లా కాకుండా భిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. తాను వేసిన బంతి మిసైల్‌లా దూసుకొచ్చి వికెట్లను కూల్చిందన్న అర్థం వచ్చేలా మిసైల్ కూలినట్లుగా సంజ్ఞ చేశాడు. భారత్‌తో సూపర్-4 మ్యాచ్‌లో పేసర్ రవూఫ్ వివాదాస్పద రీతిలో ఆరు యుద్ధ విమానాలను కూల్చినట్లు సంజ్ఞలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారం రేగింది.
ఇండియన్ ఫ్యాన్.. హారిస్ రౌఫ్‌కి బూమ్రా తిరిగి ఇచ్చేశాడు రా అని తెగ సంబర పడిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రౌఫ్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. రాఫెల్ విమానాలు రౌఫ్ ప్రైవేట్ పార్టులోకి దూరాయి అని కామెంట్స్ పెడుతున్నారు.
మోదీ ప్రత్యేక సందేశం
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ గెలుపుతో అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థిపై గెలిచిన టీమిండియాకు సాధారణ ప్రజల నుంచి ప్రధాని వరకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ, ‘‘మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్… ఎక్కడైనా ఫలితం ఒక్కటే – ఇండియా గెలిచింది’’ అంటూ భారత క్రికెటర్లను అభినందించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com