TEAM INDIA: చితక్కొట్టినా చిక్కని విజయం

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సఫారీ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా. బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించిన తరుణంలో 359 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించింది దక్షిణాఫ్రికా. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి, 358 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ, రుతరాజ్ సెంచరీ చేయడంతో భారీ స్కోర్ సాధించింది భారత్అ యితే, ఈ లక్ష్యాన్ని 49.2 ఓవర్లలో కేవలం 6 వికెట్లు నష్టపోయి సఫారీ జట్టు చేధించింది. ఇక ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది సౌతాఫ్రికా. కాగా, ఈ రెండు జట్ల మధ్య డిసెంబర్ 6వ తేదీన మూడో వన్డే ఉండనుంది. ఇందులో గెలిచిన జట్టు సిరీస్ గెలుచుకోనుంది. ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రామ్ సెంచరీ నమోదు చేశాడు. 98 బంతుల్లో 110 పరుగులు సాధించాడు. బవుమా 46 పరుగులు, మాథ్యూ బ్రీట్జ్కే 68, బ్రేవీస్ 54 పరుగులు సాధించారు. చివరలో కార్బిన్ బాష్ 29 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మార్క్రమ్ (110; 98 బంతుల్లో 10×4, 4×6) శతకానికి.. డెవాల్డ్ బ్రెవిస్ (54; 34 బంతుల్లో 1×4 5×6), మాథ్యూ బ్రీజ్కే (68; 64 బంతుల్లో 5×4) అర్ధసెంచరీలు తోడవడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కార్బిన్ బోష్ (29 నాటౌట్; 15 బంతుల్లో 4×4) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అర్ష్‌దీప్ (2/54) మినహా భారత బౌలర్లు తేలిపోయారు. నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం వైజాగ్‌లో జరుగుతుంది.
శతక్కొట్టిన కోహ్లీ, రుతురాజ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీసారు. అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సెంచరీతో చెలరేగగా.. బ్రిట్జ్కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

