Sunil Gavaskar: దగ్గర్లోనే క్రీడలను ఏలే రోజులు

ప్రపంచ క్రీడా రంగాన్ని భారత్ ఏలే రోజులు ఇక ఎంతో దూరంలో లేవని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)... చెస్ ప్రపంచకప్‌లో యువ సంచలనం ప్రజ్ఞానంద (Praggnanandhaa)... ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్(HS Prannoy)... సత్తా చాటడంపై గవాస్కర్ స్పందించాడు. కొంత కాలంగా భారత ఆటగాళ్లు(indian players) ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో సత్తా చాటుతున్నారన్న క్రికెట్ దిగ్గజం.. వచ్చే దశాబ్దంలో భారతదేశం స్పోర్ట్స్ కంట్రీగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఇంతకుముందు కొన్ని క్రీడల గురించి మాత్రమే మాట్లాడటమే చూశామని.. ఇప్పుడు అన్ని క్రీడలకూ ఆదరణ పెరుగుతోందని గవాస్కర్( Indian cricket icon) తెలిపారు. ఇటీవలి కాలంలో అథ్లెటిక్స్, చెస్, బ్యాడ్మింటన్ వంటి పలు ఆటల్లో భారతీయులు దూసుకెళ్తున్నారని, ఇది దేశాన్ని క్రీడా కేంద్రంగా మార్చే శుభ పరిణామమని తెలిపాడు. రాబోయే 10-15 ఏండ్లలో భారత్ క్రీడల్లో సూపర్ పవర్(sporting country in 10-15 years)గా ఎదుగుతుందని అతను జోస్యం పలికాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలిచిన సమయంలో తాను ఇంగ్లండ్‌లోనే ఉన్న విషయాన్ని సన్నీ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ప్రముఖ బాలీవుడ్ గీతం ‘మేరే దేశ్ కి ధర్‌తీ’ పాట పాడుతూ నీరజ్ (Neeraj Chopra) స్వర్ణ పతకాన్ని ఎంజాయ్ చేశానని.... ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ నెగ్గినప్పుడు కూడా తనకు అచ్చం అలాంటి భావనే కలిగిందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్(HS Prannoy) సత్తాచాటాడని, అతను ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడిని చిత్తు చేయడం చాలా గొప్ప విషయమని అన్నాడు. ఆనందించదగ్గ విషయమని సన్నీ అన్నాడు.
అమెరికా, ఆస్ట్రేలియాలను క్రీడాదేశాలుగా భావిస్తుంటారని..... భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూస్తుంటే వచ్చే 10-15 ఏళ్లలో భారతదేశాన్ని కూడా ‘స్పోర్ట్స్ కంట్రీ’గా పిలుస్తారని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ ఏడాది భారత క్రీడారంగంలో అద్భుతమైనదిగా అభివర్ణించిన ఆయన... క్రికెట్‌లో ప్రపంచకప్ కూడా గెలిస్తే అది సంపూర్ణం అవుతుందున్నారు. స్వదేశంలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్‌ను మరోసారి ఒడిసి పట్టడానికి ఇంతకంటే మంచి సమయం లేదని గవాస్కర్ అన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com