CT2025: ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

CT2025: ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
X
కివీస్‌పై ఫైనల్లో విజయం... సమష్టిగా రాణించిన టీమిండియా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 76, శ్రేయస్ అయ్యర్ 48, గిల్ 31, అక్షర్ 29 పరుగులతో రాణించగా.. చివరిల్లో కేఎల్ రాహుల్ 34* రన్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు కివీస్ 251 పరుగులకు పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్(63)అర్ధ సెంచరీతో రాణించాడు. ), బ్రేస్‌వెల్‌ (53 నాటౌట్‌) అర్ధసెంచరీలు సాధించగా రచిన్‌ (37), ఫిలిప్స్‌ (34) సహకారం అందించారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, కుల్ దీప్ రెండు, షమీ, జడేజాలు చేరో వికెట్ తీసుకున్నారు. మొత్తంగా భారత్ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని కివీస్ నిర్దేశించింది.

కివీస్ జోరుకు స్పిన్నర్ల బ్రేక్

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరంభం, ముగింపుల్లో అదరగొట్టినా.. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్ల ధాటికి కుదేలైంది. చివర్లో బ్రేస్‌వెల్‌ వేగంగా ఆడాడు. సెమీస్‌లో శతకం సాధించి ఊపుమీదున్న ఓపెనర్‌ రచిన్‌ కళ్లుచెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఓపెనింగ్ జోడీని స్పిన్నర్‌ వరుణ్‌ విడదీశాడు. యంగ్‌ను ఎల్బీ చేయడంతో తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక తొలి పవర్‌ప్లేలో 69/1 స్కోరుతో జోరు మీదున్న కివీ్‌సకు కుల్దీప్‌ తన వరుస ఓవర్లలో గట్టి ఝలక్‌ ఇచ్చాడు. ముందుగా ఓ గూగ్లీతో రచిన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా, తర్వాత వెటరన్‌ విలియమ్సన్‌ (11)ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. అక్కడి నుంచి స్పిన్నర్ల హవా ఆరంభం కావడంతో కివీస్‌ పరుగుల కోసం చెమటోడ్చింది. 15-26 ఓవర్ల మధ్య కనీసం ఫోర్‌ కూడా సాధించలేదు. చివరకు 81 బంతుల తర్వాత ఫిలిప్స్‌ ఓ సిక్సర్‌తో మురిపించాడు. 38వ ఓవర్‌లో ఫిలిప్స్‌ను వరుణ్‌ బౌల్డ్‌ చేయడంతో మిచెల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బ్రేస్‌వెల్‌ ధాటికి ఆఖరి ఐదు ఓవర్లలో జట్టు 50 రన్స్‌ రాబట్టడం విశేషం.

నాలుగు క్యాచ్‌‌లు మిస్ చేసిన భారత్

ఫైనల్‌లో భారత ఫీల్డింగ్ విఫలమైంది. న్యూజిలాండ్ బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్‌లను వదిలేశారు. షమీ, అయ్యర్, రోహిత్, గిల్ క్యాచ్‌లను వదిలేయడంతో కివీస్ నెమ్మదిగా స్కోర్ పెంచుకుంటూ వెళ్లింది. జట్టులో అద్భుతమైన క్యాచ్‌లు అందుకొనే ఫీల్డర్లు కూడా పేలవ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

టీమిండియాకు మెరుపు ఆరంభం

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మెరుపు ఆరంభమే దక్కింది. కానీ కివీస్‌ బౌలర్ల పోరాటంతో ఈ పోరు ఆఖరి ఓవర్‌ వరకు సాగి కాస్త ఉత్కంఠను రేకెత్తించింది. రోహిత్‌ సహజశైలిలో చెలరేగాడు. తొలి ఓవర్‌లోనే సిక్సర్‌ బాదిన రోహిత్.. రెండో ఓవర్‌లో రెండు ఫోర్లతో మరింత ఒత్తిడి పెంచాడు. హిట్‌మ్యాన్‌ ఫిఫ్టీ 41 బంతుల్లోనే పూర్తయ్యింది. అలాగే జట్టు స్కోరు 17 ఓవర్లలోనే 100 పరుగులకు చేరింది. కానీ గిల్‌ను శాంట్నర్‌ అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 105 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే విరాట్‌ (1)ను బ్రేస్‌వెల్‌ అవుట్‌ చేయడంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. రోహిత్‌-శ్రేయాస్‌ అతి జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. బ్రేస్‌వెల్‌ విసిరిన చివరి ఓవర్‌లో అనవసర షాట్‌కు వెళ్లి అక్షర్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో మ్యాచ్‌ నువ్వానేనా అన్న రీతికి చేరింది. అయుతే ఆఖర్లో రాహుల్‌కు జతగా హార్దిక్‌ (18) జోరు చూపాడు. 24 బంతుల్లో 21 రన్స్‌ కావాల్సిన వేళ హార్దిక్‌ ఓ సిక్స్‌, ఫోర్‌తో పరిస్థితి తేలిక చేశాడు. 48వ ఓవర్‌లో తను క్యాచ్‌ అవుటైనా అప్పటికే ఫలితం తేలిపోయింది. తర్వాతి ఓవర్‌లో ఓ ఫోర్‌తో జడేజా మ్యాచ్‌ను ముగించాడు.

Tags

Next Story