CT 2025: టీమిండియాకు శుభాకాంక్షల వెల్లువ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత్.. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి భారత్ సత్తా చాటిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా టీమిండియాకు విషెస్ తెలియజేశారు.
అపూర్వ విజయం: ప్రధాని మోదీ
ICC ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో టీమిండియా విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘అసాధారణ మ్యాచ్.. అపూర్వ విజయం’ అంటూ పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. టోర్నమెంటు మొత్తం అద్భుతంగా ఆడారంటూ జట్టు సభ్యులను మోదీ ప్రశంసించారు.
కంగ్రాట్స్ టీమిండియా: పవన్
ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ‘కంగ్రాచులేషన్స్ టీమిండియా. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడం జట్టు అంకితభావానికి, ప్రతిభకు గీటురాయి. టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. అలాగే, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా భారత జట్టుకు అభినందనలు తెలిపారు.
టీమిండియాకు ఎన్టీఆర్ విషెస్
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు! ’’ అని ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com