IND vs ENG: మూడో టెస్టు.. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా బ్యాటింగ్

IND vs ENG: మూడో టెస్టు.. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా  బ్యాటింగ్

రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ టెస్టులో అరంగ్రేటం చేస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, వైజాగ్ టెస్టులో ఆడ‌ని సిరాజ్‌లు జ‌ట్టులోకి వ‌చ్చారు. మ‌రోవైపు ఇంగ్లండ్ జ‌ట్టు ఒక్క మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. యంగ్ స్పిన్నర్ బ‌షీర్ స్థానంలో మార్క్ వుడ్ ఆడుతున్నాడు. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ 1-1తో సమంగా ఉన్నాయి.

భారత జట్టు

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, జడేజా, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, కుల్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు

జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌, జోరూట్‌, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్‌ (కెప్టెన్‌), బెన్‌ ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), రెహాన్‌ అహ్మద్‌, టామ్‌ హార్ట్‌లీ, మార్క్‌వుడ్‌, జేమ్స్‌ అండర్సన్‌

Tags

Read MoreRead Less
Next Story