పారా ఒలింపిక్స్ లో అదరగొట్టిన భారత అథ్లెట్.. హై జంప్ లో ప్రవీణ్ కు గోల్డ్
పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల హైజంప్ లో అథ్లెట్ ప్రవీణ్ కుమార్ బంగారం పతకం సాధించాడు.శుక్రవారం జరిగిన టీ64 హైజంప్ పోటీల్లో 2.08మీటర్ల ఎత్తు జంప్ చేసి ప్రవీణ్ గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హైజంప్ రికార్డు కావడం విశేషం. కాగా.. పారా ఒలింపిక్స్‌లో ప్రవీణ్ వరుసగా రెండో పతకం సాధించాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21ఏళ్ల అథ్లెట్.. 2021లో జరిగిన టోక్యో పారా ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించాడు. అతిచిన్న వయసులోనే ఒలింపిక్ పతకం సాధించిన పారా అథ్లెట్‌గా అప్పుడు రికార్డ్ క్రియేట్ చేశాడు. పారా ఒలింపిక్స్ హైజంప్ పోటీల్లో భారత తరఫున గోల్డ్ సాధించిన రెండో ఆటగాడు ఇతడే. అంతకుముందు మరియప్పన్ తంగవేలు ఈ పోటీల్లో బంగారు పతకం నెగ్గాడు. ఇక, పారిస్ పోటీల్లో పతకం నెగ్గిన మూడో హైజంపర్‌గా నిలిచాడు. ఈ ఏడాది జరుగుతున్న పోటీల్లో ఇప్పటికే హైజంప్ టీ-63 విభాగంలో శరద్ కుమార్ సిల్వర్ (1.88 మీటర్లు), తంగవేలు మరియప్పన్ కాంస్యం (1.85 మీటర్లు)సాధించారు. పారా ఒలింపిక్స్ లో భారత్ అథ్లెట్లు దక్కించుకున్న పతకాల సంఖ్య 26కు చేరింది. ఇందులో 6 గోల్డ్, 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com