Cricket : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

Cricket : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
X

భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ తనకు చివరిదని తెలిపారు. వచ్చే IPL వేలానికి కూడా ఆయన రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో ఈ 40ఏళ్ల వికెట్ కీపర్ IPLకూ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడిన సాహా, రంజీల్లో బెంగాల్, త్రిపుర జట్లకు, IPLలో KKR, CSK, PBKS, SRH, GTకి ప్రాతినిధ్యం వహించారు.

2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు చివరిసారిగా 2021లో కివీస్‌ పైనే వాంఖడే వేదికగా టెస్టు ఆడాడు. ధోనీ, పంత్‌ తర్వాత అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా సాహా (3) నిలిచాడు.

వచ్చే సీజన్‌ కోసం జరగనున్న మెగా వేలంలో సాహా తన పేరు నమోదు చేసుకోకపోవచ్చని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌కూ దూరం కావడం ఖాయమేనని సమాచారం. ‘‘అద్భుత క్రికెట్‌ ప్రయాణం ముగింపుదశకు చేరుకుంది. ఈ రంజీ సీజన్‌ నాకు చివరిది. బెంగాల్‌ తరఫున ఆఖరిసారి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది. ఈ సీజన్‌ గుర్తుండిపోయేలా చేసుకుంటానని భావిస్తున్నా’’ అని వెల్లడించాడు.

Tags

Next Story