Indian Players : క్వార్టర్ ఫైనల్స్‌లో అదరగొట్టిన భారత ప్లేయర్లు

Indian Players : క్వార్టర్ ఫైనల్స్‌లో అదరగొట్టిన భారత ప్లేయర్లు
X

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రీ-క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన చైనా షట్లర్ వాంగ్ జీ యీని సింధు ఓడించింది.సింధు వరుస సెట్లలో 21-19, 21-15 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం తర్వాత ఆమె తర్వాతి మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన పుత్రీ కుసుమ వార్దానీతో తలపడనుంది. ఈ ఇద్దరూ గతంలో నాలుగు సార్లు తలపడగా, సింధు రెండు సార్లు విజయం సాధించింది. 2025లో పుత్రి అద్భుత ఫామ్‌లో ఉంది. ఆమె ఈ ఏడాది 39 మ్యాచ్‌లలో 27 గెలిచి, 12 ఓడింది. మరోవైపు, సింధు 21 మ్యాచ్‌లలో 9 గెలుపు, 12 ఓటములను చవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత క్రీడాకారుడు హెచ్.ఎస్.ప్రణయ్, ప్రపంచ రెండో ర్యాంకర్ డెన్మార్క్‌కు చెందిన ఆండెర్స్ ఆంటోన్సెన్‌తో జరిగిన పోరులో పోరాడి ఓడిపోయాడు. మరో భారత క్రీడాకారుడు లక్ష్య సేన్ తొలి రౌండ్‌లోనే ప్రపంచ నెంబర్ 1 షి యు కీ (చైనా) చేతిలో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్, తనీశా క్వార్టర్స్ దూసుకెళ్లారు. ఫైనల్స్ ఆగస్టు 31న జరుగుతాయి.

Tags

Next Story