IPL : ఐపీఎల్ ఇక్కడే..! క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్

IPL అంటేనే ఇండియాలో చాలామందికి పూనకాలు వస్తుంటాయి. బీసీసీఐ (BCCI) ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా టీ20 టోర్ని ప్రారంభమైన ఈ లీగ్ ఇక ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా అవతరించింది. ఐపీఎల్లో ఆడటానికి ఎంతో మంది విదేశీ స్టార్ ప్లేయర్లు కూడా ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు.
2024 ఐపీఎల్ సీజన్ విషయంలో గత కొంతకాలం నుంచి ఒక సందిగ్ధత నెలకొంది. టోర్నీ మార్చి నెలలో జరుగుతూ ఉండగా.. అదే సమయంలో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. తద్వారా ఇక ఈ వేదికను విదేశాలకు మార్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ టోర్నీని భారత్లో నిర్వహిస్తారా లేదా విదేశాలకు వేదికను మారుస్తారా అనే విషయంపై చర్చ జరుగుతుంది.
ఇలాంటి టైంలో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ పండగ లాంటి న్యూస్ చెప్పాడు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ (Arun Singh Dhumel). ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను అటు ఇండియాలోనే నిర్వహిస్తామూ అంటూ చెప్పాడు అరుణ్ సింగ్. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తేదీలు వచ్చిన తర్వాత ఇక ఐపీఎల్ షెడ్యూల్ ను ప్రకటిస్తాము అంటూ ఆయన తెలిపారు. క్లారిటీ రావడంతో.. టీమిండియా ఫ్యాన్స్, క్రికెటల్ లవర్స్ ఐపీఎల్ సన్నాహాల్లో మునిగిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com