IPL: ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో అవుట్

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ నిష్క్రమించింది. లక్నోపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రాణించిన మార్ష్, మార్‌క్రమ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. సన్‌రైజర్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న లఖ్‌నవూ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), మార్‌క్రమ్ (61) బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. రిషభ్ పంత్ (7) మరోసారి విఫలమయ్యాడు. నికోలస్ పూరన్ (45) మరోసారి కీలక పరుగులు చేశాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
మెరిసిన అభిషేక్
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అభిషేక్ అర్ధ శతకంతో మెరిశాడు. క్లాసెన్ 47, ఇషాన్ కిషన్ 35, కమిందు మెండిస్ 32 పరుగులు చేయడంతో హైదరాబాద్ సునాయస విజయం సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com