IPL: ఐపీఎల్ వేలంలో ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడుపోయాడంటే..?

ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. భారత ఆటగాళ్లను దక్కించుకునేందుకు ధరను పెంచేస్తూ పోయాయి. ఐపీఎల్ వేలంలో గత రికార్డులన్నీంటినీ కాల గర్భంలో కలిస్తూ టీమిండియా ఆటగాళ్లపై ప్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. భారత స్టార్ ఆటగాళ్లపై కోట్లకు కోట్లు గుమ్మరించాయి.
టాప్ 5 ధర మన ఆటగాళ్లకే
రిషభ్ పంత్‌కు రూ.27 కోట్లు( లక్నో)
శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు( పంజాబ్)
వెంకటేశ్ అయ్యర్ రూ.23.75 కోట్లు(కోల్‌కతా )
అర్ష్‌దీప్ సింగ్ రూ.18 కోట్లు(పంజాబ్ )
యజ్వేంద్ర చాహల్ రూ.18 కోట్లు(పంజాబ్ )
కేఎల్ రాహుల్ రూ. 14 కోట్లు(ఢిల్లీ)
విదేశీ ఆటగాళ్లకు ఎంత దక్కిందంటే...
.*జోస్ బట్లర్ రూ.15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
*ట్రెంట్ బౌల్ట్ రూ.12.50 కోట్లు (ముంబై)
*జోఫ్రా ఆర్చర్, రూ.12.50 కోట్లు (రాజస్థాన్)
*హాజెల్‌వుడ్ రూ.12.50 కోట్లు( బెంగళూరు)
*ఫిల్ సాల్ట్ రూ.11.50 కోట్లు (బెంగళూరు)
*స్టొయినిస్ రూ.11 కోట్లు (పంజాబ్)
*రబాడ రూ.10.75 కోట్లు ( గుజరాత్ టైటాన్స్)
*నూర్ అహ్మద్ రూ.10 కోట్లు (సీఎస్‌కే)
భారత బౌలర్లపై కాసుల వర్షం
ఐపీఎల్ వేలంలో భారత బౌలర్లపై కాసుల వర్షమే కురిసింది. అర్ష్ దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. సిరాజ్ రూ.12.25 కోట్లకు గుజరాత్ వశమయ్యాడు. షమీ రూ.10 కోట్లు, ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు హైదరాబాద్ చేజిక్కించుకుంది. నటరాజన్ ను రూ.10.75 కోట్లకు ఢిల్లీ, అవేశ్ రూ.9.75 కోట్లకు లక్నో దక్కించుకున్నాయి. ప్రసిద్ధ్ రూ.9.50 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com