IPL: క్రికెట్ పండగ.. మళ్ళీ షురూ

IPL: క్రికెట్ పండగ.. మళ్ళీ షురూ
X
ఆడంబరాలు లేకుండా పునఃప్రారంభం కానున్న ఐపీఎల్

ఏప్రిల్ 22, 2025 భూతాల స్వర్గం కశ్మీర్‌లోని పహల్గామ్‌లో తమ కుటుంబ, వృత్తిపర భారాల నుంచి కాస్త రిలాక్స్ కావడానికి దేశం నలువైపులా నుంచి కొన్ని కుటుంబాల వచ్చి ఆనందిస్తున్నాయి. అయితే, అదే స్వర్గం పక్క నుంచి కొందరు నరరూప రాక్షుసులు వచ్చి భారత స్త్రీల తిలకాలని తుడిపేశారు. దీనికి ప్రతిచర్యగా భారత్ మే 7, 2025న ఆపరేషన్ సిందూర్ పేరుతో న్యాయ యుద్ధం చేపట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతోగా ఆస్వాదిస్తున్న క్రికెట్ పండగ మే 9, 2025న అర్థాంతరంగా వాయిదాపడింది. కొన్నేళ్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఈ ఏడాది ఐపీఎల్‌తో తిరిగి వెలుగులు నిండాయి. కానీ.. ఉగ్రవాదుల కర్కశత్వానికి మరో సారి ఆ స్టేడియంలో చీకట్లు కమ్ముకున్నాయి. క్రికెట్ పండుగని ఆస్వాదించడానికి వచ్చిన ప్రేక్షకులలో భయనాందోళనలు, నిరాశ, నిస్పృహ ఏర్పడ్డాయి. అయితే ఈ నిర్ణయం తూటాలకు భయపడి ఆపేసింది కాదు. ఒకవైపు బార్డర్‌లో భారత ముద్దుబిడ్డలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటే.. మరోవైపు దేశంలో పండగ వాతావరణం అవసరంలేదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన అతిథులకు భద్రత, విశ్వాసాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాస్త ఉద్రిక్తతలు తగ్గటంతో క్రికెట్ పండగ మళ్ళీ షురూ అయ్యింది.

రీ స్టార్ట్

మార్చి 22, 2025న క్రికెట్ మక్కా.. కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్ల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఐపీఎల్ సీజన్.. ఇప్పుడు అదే జట్ల మద్యపోరుతో మే 17, 2025న పునఃప్రారంభం కానుంది. ఈ సారి బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదిక అయ్యింది. అయితే ఈ సారి చీర్ లీడర్స్, డీజేల వంటి హై పిచ్ సెలబ్రేషన్స్‌కి ఐపీఎల్ దూరంగా ఉండనుంది. ఆఫ్ట్రాల్ క్రికెట్ అనేది జెంటిల్‌మేన్ గేమ్ కాబట్టి పరిస్థితుల దృష్ట్యా స్పోర్ట్స్ మ్యాన్ షిప్ చూపిస్తోంది. కావాల్సినపుడు అగ్రెషన్ చూపెడుతోంది. స్పోర్ట్ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైఫ్/ సొసైటీ అని చెప్పకనే చెప్పొచ్చు.

తెలుపెక్కబోతున్న చిన్నస్వామి

భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తొలిసారి స్టేడియంలో కనిపించనున్నారు. వారం రోజుల పాటు ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత శనివారం ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. మరోవైపు ప్లే ఆఫ్స్ నేపథ్యంలో స్టేడియం ఎరుపెక్కాల్సింది కానీ.. తెలుపెక్కబోతుంది. విరాట్‌కు గ్రాండ్ ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. చివరిసారిగా కోహ్లీని టెస్టు క్రికెట్లో చూసేందుకు అవకాశం లేకపోవడంతో అభిమానులు పూర్తిగా వైట్ జెర్సీలో వచ్చి కోహ్లీకి ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు.

పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ పై క్లారిటీ

మే 9న అర్థంతరంగా ఆగిపోయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌పై క్లారిటీ వచ్చింది. మే 26న జైపూర్ వేదికగా ఈ రెండు జట్లు తిరిగి తలపడనున్నాయి. ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి… పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు ఆడింది. 122 పరుగులు.. చేయడం జరిగింది.10 ఓవర్లు పూర్తి కాగానే సైరన్ మోగించారు. స్టేడియంలో లైట్స్ మొత్తం ఆపేసారు. అనంతరం ప్లేయర్లు అందరినీ సేఫ్ ప్లేస్ లోకి తరలించారు. అనంతరం స్టేడియంకు వచ్చిన అభిమానులందరికీ బయటకు పంపారు. ధర్మశాల వేదికగా రద్దైన మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లను ప్రత్యేక వందే భారత ట్రైన్ లో ధర్మశాల నుంచి ఢిల్లీకి ప్లేయర్లను తరలించారు.

Tags

Next Story