Ishan Kishan : దులిఫ్ ట్రోఫీలో దుమ్మురేపిన ఇషాన్

Ishan Kishan : దులిఫ్ ట్రోఫీలో దుమ్మురేపిన ఇషాన్
X

దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్ మ్యాచ్‌లు గురువారం స్టార్ట్ అయ్యాయి. ఏపీలోని అనంతపురంలో ఆర్డీటీ స్టేడియాల వేదికగా నాలుగు టీమ్స్ మధ్య మ్యాచ్ లు మొదలయ్యాయి. ఇండియా ‘బి’తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటర్లందరూ సత్తా చాటడంతో ఇండియా ‘సి’ తొలి రోజు ఆట ముగిసేసరికి 357/5 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌ కోల్పోయి మళ్లీ టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ఇషాన్‌ కిషన్‌ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అనుహ్యంగా దులీప్ ట్రోఫీకి ఎంపికైన ఇషాన్‌ సెంచరీ బాదాడు. 126 బాల్స్ లో 14 ఫోర్లు, 3 సిక్స్ లతో 111 రన్స్ చేశాడు. బాబా ఇంద్రజిత్ 78 రన్స్, సాయి సుదర్శన్ 31 రన్స్, రజత్ పటిదార్ 40 రన్స్ తో అదరగొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ 46 రన్స్, మానవ్ సుతార్ 8 రన్స్ తో క్రీజులో ఉన్నారు. ఇండియా ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్‌ 3, నవదీప్‌ సైని, రాహుల్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.

శామ్స్ ములాని 88 రన్స్..

ఇండియా డితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఎ మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టును ఏడో స్థానంలో వచ్చిన శామ్స్ ములాని 88 రన్స్ నాటౌట్,ఎనిమిదో స్థానంలో వచ్చిన తనుష్‌ కొటియన్ 53 రన్స్ తో టీమ్ ను ఆదుకున్నారు. రియాన్ పరాగ్ 37 రన్స్, ఓపెనర్లు ప్రథమ్‌ సింగ్

7 రన్స్, మయాంక్ అగర్వాల్ 7 రన్స్, తిలక్ వర్మ 10 రన్స్, శాశ్వత్ రావత్ 15 రన్స్ తో తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టారు. కుమార్ కుశాగ్రా 28 రన్స్ చేశాడు. ములానితో పాటు ఖలీల్ అహ్మద్ 15 రన్స్ తో క్రీజులో ఉన్నాడు. ఇండియా డి బౌలర్లలో హర్షిత్ రాణా, విద్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, శరన్ష్ జైన్, సౌరభ్‌ కుమార్‌ చెరో వికెట్ తీశారు.

Tags

Next Story