Cricket : ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో జడేజా డౌట్?

Cricket : ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో జడేజా డౌట్?
X

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఆల్‌రౌండర్ జడేజా స్థానంపై సందిగ్ధం నెలకొంది. అతడిని జట్టులోకి తీసుకోవాలా? భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూనియర్లకు చోటు కల్పించాలా? అనే దానిపై BCCI ఆలోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆల్‌రౌండర్‌కు అక్షర్, దూబే, సుందర్ నుంచి పోటీ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దుబాయ్‌లో స్పిన్ పిచ్‌లపై ఆడుతుండటంతో అనుభవమున్న ప్లేయర్ కావాలని భావిస్తే జడేజాను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టు ప్రకటన ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12లోపు అనౌన్స్ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ICCని గడువు పొడిగించాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 లేదా 19న జట్టు ప్రకటన ఉంటుందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న T20, వన్డేలకు జట్లను ప్రకటించలేదు. అయితే, రెండ్రోజుల్లో T20 జట్టును ప్రకటిస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story