Bumrah : మూడు ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్

టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఏ ఫార్మాట్ అయినా అద్భుతం అదరగొడుతున్నాడు. తన బౌలింగ్‌తోనే చాలా మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. బుమ్రాపై భారత్‌తో పాటు చాలా మంది విదేశీ ప్లేయర్లు, మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి వచ్చేశారు ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. తాజాగా బుమ్రాపై స్మిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకానుంది. ఆసీస్ గడ్డపై జరగనున్న ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి చాలా క్రేజ్ ఉంది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ కీలక కామెంట్లు చేశాడు. జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించారు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రానే ప్రపంచంలో బెస్ట్ బౌలర్ అని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో స్టీవ్ స్మిత్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్లేయర్.. టీమిండియా పేసర్‌ను ఈ రేంజ్లో ప్రశంసించడం విశేషంగా ఉంది. “అతడో (బుమ్రా) అద్భుతమైన బౌలర్. కొత్త బాల్‌తో అయినా, కాస్త పాతబడిన బంతితో అయినా, పాత బంతితో అయినా అతడి బంతులను ఎదుర్కొనేటప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఈ అన్ని విషయాల్లో బుమ్రాకు గొప్ప స్కిల్ ఉంది” అని స్మిత్ చెప్పాడు. బుమ్రా బెస్ట్ బౌలర్ అని, అతడు ఎదుర్కోవడం ఎప్పుడైనా సవాలుగా ఉంటుందని స్మిత్ అన్నారు. “అతడు గొప్ప బౌలర్.. అంతేకాదు మూడు ఫార్మాట్లలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్. అతడి ఎదుర్కోవడం ఎప్పుడైనా ఛాలెంజ్‌లా ఉంటుంది” అని స్మిత్ అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా రెండు టెస్టు సిరీస్‌లు ఆడాడు. ఏడు టెస్టుల్లో 32 వికెట్లతో రాణించాడు. అద్భుతమైన బంతులను వేశాడు. టీమిండియా సిరీస్‌ల గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇక, ఆసీస్‌లో మూడో సిరీస్ ఆడనున్నాడు. బుమ్రాపైనే అందరి కళ్లు ఉండనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com