కగిసో రబడా టెస్ట్ క్రికెట్ లో రికార్డు

X
By - Manikanta |22 Oct 2024 10:15 PM IST
దక్షిణాఫ్రికా స్టార్ ఫేసర్ కగిసో రబడా టెస్ట్ క్రికెట్ చిత్రలో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరిన ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్.. బంతుల పరంగా అతి వేగంగా ఈ ఘనతను సాధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్‌లో 11,817 బంతుల్లో రబడా 300 వికెట్లు సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్థాన్ మాజీ ఫేసర్ వకార్ యూనిస్ పేరిట ఈ ప్రపంచ రికార్డ్ ఉంది. పాక్ దిగ్గజ ఫేసర్ వకార్ యూనిస్ 12,602 బంతుల్లో 300 టెస్ట్ వికెట్లు సాధించాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకా స్టేడియంలో జరిగిన జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రబడా సోమవారం ఈ రికార్డును తన పేరిట తిరగరాశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com