Cricket : కరుణ్‌కు లాస్ట్ ఛాన్స్.. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆడే అవకాశం..?

భారత్ - ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత జట్టు సిరీస్‌ను 2-2తో సమం చేయగలదు. అందువల్ల, నేటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా అదనపు బ్యాటర్‌ను రంగంలోకి దించుతుందని సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం.. కరుణ్ నాయర్‌కు చివరి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన శార్దూల్ ఠాకూర్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించి.. అతని స్థానంలో కరుణ్‌ను తీసుకురావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
కరుణ్ నాయర్ మొదటి మూడు మ్యాచ్‌లలో ఆడాడు. అతడు 6 ఇన్నింగ్స్‌లలో 249 బంతులు ఎదుర్కొని కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ నుంచి తొలగించారు. కెన్నింగ్టన్ ఓవల్‌లో కరుణ్‌కు ఇప్పుడు మరో అవకాశం ఇవ్వనున్నట్లు ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్ తెలిపింది. ఇదిలా ఉండగా, కరుణ్ నాయర్ మళ్ళీ ప్లేయింగ్ ఎలెవన్ లో కనిపిస్తే, కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కడం సందేహమే. ఎందుకంటే గత నాలుగు మ్యాచ్‌ల్లో బెంచ్‌పై ఉన్న కుల్దీప్, ఐదో టెస్టులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో బరిలోకి దిగుతాడని భావించారు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్ రావడం ఖాయం. అదేవిధంగా రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా కనిపించనున్నాడు. అయితే అన్షుల్ కాంబోజ్ స్థానంలో ఎవరు వస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అర్ష్‌దీప్ సింగ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరు ఆడే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com