KKR Worst Record : కేకేఆర్ చెత్త రికార్డ్.. పాయింట్ల పట్టికలో అట్టడుగున

కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌పై 10 సార్లు ఓడింది. ఈ క్రమంలో పంజాబ్ (కోల్‌కతాలో కేకేఆర్ పై 9 ఓటములు) పేరిట ఉన్న చెత్త రికార్డును చెరిపేసింది. మరోవైపు ముంబైపై కేకేఆర్ ఇప్పటివరకు 24 సార్లు ఓడింది. ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా నిలిచింది.
ముంబైతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ రహానే స్పందించారు. మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడానికి బ్యాటర్ల వైఫల్యమే కారణమన్నారు. బౌన్స్‌తో కూడిన మంచి బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ భాగస్వామ్యాలు నమోదు కాలేదని చెప్పారు. 180-190 వరకు స్కోర్ చేస్తామని భావించినా పవర్ ప్లేలోనే 4వికెట్లు కోల్పోవడంతో సాధ్యపడలేదన్నారు. బౌలర్లు పోరాడినా స్కోర్ పెద్దగా లేకపోవడంతో ఫలితం దక్కలేదని తెలిపారు.
ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ నిరాశాజనక పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఇప్పటివరకు 3 మ్యాచులాడి రెండింట్లో ఓడింది, ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగున నిలిచింది. మరోవైపు ఆర్సీబీ టాప్‌లోనే కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com