CAPTIAN: టెస్ట్ కెప్టెన్ ఎవరో తేలేదీ అప్పుడే

సుదీర్ఘ ఫార్మట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ చర్చోపచర్చలు జరుపుతోంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఎవరి వాదన వారు వినిపిస్తు న్నారు. రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు లకు రిటైర్‌మెం ట్ ప్రకటించడంతో భారత టెస్ట్ జట్టు కొత్త సారథి ఎవరనే చర్చలు ఊపందుకున్నాయి. శుబ్‌మ న్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా .. ఇలా కెప్టెన్సీ రేసులో చాలా పేర్లు వినిపిస్తు న్నాయి. ఈ నలుగురిలో ఏదో ఒక పేరు ఖాయమవుతుందని డిస్కషన్స్ నడుస్తు న్నాయి. ఈ తరుణంలో రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు తో పాటు నయా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. మే 24న ఈ విషయంపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
ఆ రోజే అనౌన్స్‌మెంట్!
జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది భారత్. 5 మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్‌తో తలపడనునుంది టీమిండియా. దీనికి సంబంధించిన భారత జట్టు తో పాటు కొత్త కెప్టెన్ ఎవరనేది మే 24న సెలెక్ట్ చేసే చాన్స్ ఉందని సమాచారం. శనివారం సెలెక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత దీనిపై ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇప్పటికే సారథి ఎవరనేది బోర్డు పెద్ద లు డిసైడ్ అయ్యారని.. ఆ తేదీన అధికారికంగా ప్రకటిస్తా రని, ఆ డేటే డెడ్‌లై న్ అని సోషల్ మీడియాలో పుకార్లు వస్తు న్నాయి.
బుమ్రా కష్టమే...
వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. అతడు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో సారథ్య బాధ్యతలు దక్కడం అనుమానమే. భారత టెస్టు జట్టు లో శుభ్‌మ న్ గిల్ స్థా నం ఇంకా సుస్థి రం కాలేదు. ఈ నేపథ్యంలో అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించడంపై సెలక్టర్లలో ఒకరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొదట అతడికి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగిస్తే మేలని అభిప్రాయపడినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com